WhatsApp video calling feature

Whatsapp video calling feature

WhatsApp, video calling feature, Social Media, whatsapp, New feature in whatsapp

whatsApp seems set to be taking on Skype in a bigger way in coming weeks with the planned roll out of a video calling feature.German blog Macerkopf.de has leaked screenshots of the WhatsApp video calling feature from private beta versions of the iPhone version of the app. Screenshots of the video calling feature show that users will be able to turn off the mic as well as flip the camera. The layout of video calls shows two windows, one each for the caller and the person who has received the call.

వాట్సాప్ ద్వారా వీడియో కాలింగ్

Posted: 12/24/2015 09:21 AM IST
Whatsapp video calling feature

సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడే వారికి... అందులోనూ వాట్సప్ ను బాగా వాడే వారికి గుడ్ న్యూస్. త్వరలో వాట్సప్లోనూ వీడియో కాలింగ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. వీడియో కాలింగ్ సదుపాయం ప్రస్తుతం స్కైప్, ఐఎమ్ఓ, గూగుల్ హ్యాంగవుట్స్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యామాల్లో అందుబాటులో ఉంది. అయితే ఫేస్బుక్ మెసెంజర్కు దీటుగా వాట్సప్ను అభివృద్ధి చేస్తున్ననేపథ్యంలో తాజాగా ప్రవేశపెట్టబోయే ఐఓఎస్ వెర్షన్లో ఈ సదుపాయం కల్పించాలని వాట్సప్ నిర్ణయించినట్లు ఓ జర్మన్ వెబ్సైట్ పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం వినియోగిస్తున్న మెసెంజర్ యాప్లలో వాట్సప్ కూడా ఒకటి. 2015 సెప్టెంబర్ నాటికే వాట్సప్ వినియోగదారుల సంఖ్య 900 మిలియన్లుగా ఉంది. ప్రస్తుతం అది ఇంకా పెరిగి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో మరింత మందికి వినియోగదారులకు చేరువయ్యేందుకు, అలాగే మిగిలన మెసెంజర్ల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు వీడియో కాలింగ్ సదుపాయాన్ని తీసుకురానున్నారు. ఐఓఎస్ వెర్షన్ 2.12.16.2లో ఈ వీడియోకాలింగ్ టెస్టింగ్ దశలో ఉంది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ను జర్మన్ వెబ్సైట్ విడుదల చేసింది. ప్రస్తుతం వీడియోకాలింగ్ సదుపాయం అందిస్తున్న అన్నింటికన్నా ఇందులో భిన్నంగా, అత్యాధునిక ఫీచర్స్ కల్పిస్తున్నట్టు జర్మన్ వెబ్సైట్ తెలిపింది. వీడియో కాల్ మాట్లాడుతూనే స్క్రీన్ షాట్ తీసుకునే సదుపాయం, మల్టీ ట్యాబ్ సదుపాయం వంటి ఫీచర్లను వాట్పప్ వీడియోకాలింగ్కు జోడిస్తున్నట్లు తెలిసింది. ఐఓఎస్ వెర్షన్లో 2016 మార్చికి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WhatsApp  video calling feature  Social Media  whatsapp  New feature in whatsapp  

Other Articles