TDP MLA Cried in Ap Assembly

Tdp mla cried in ap assembly

MLA Anitha, Anitha, TDP, Roja, AP, Assembly, Chandrababu Naidu, YS Jagan

TDP MLA Anitha cried in AP Assembly. She asked the behaviour of MLA Roja in the house. She said that Roja insulted woman and a supressed caste lady in the honarable house.

ఏపి అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏడ్చింది

Posted: 12/22/2015 03:48 PM IST
Tdp mla cried in ap assembly

టీడీపీ నేత, పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత అసెంబ్లీలో కంటతడి పెట్టారు. దళితురాలు అయినందుకే తనను టార్గెట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను నేనే కాపాడుకోలేపోతే ఇక ప్రజలను ఏం కాపాడతానని ఆమె వాపోయారు. రోజా లాంటి మహిళ కోసం వైసిపి సభను బాయ్ కాట్ చేయడం బాధాకరమన్నారు. అసలు రోజా సభలో వచ్చి కూర్చుంటున్నారంటే అది స్పీకర్ పెట్టిన క్షమాభిక్ష అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేసే స్థాయికి ఆమె వెళ్లిందని, ఆ విషయాన్ని తాను ప్రస్తావించినందుకు తనను టార్గెట్ చేశారని అనిత ఆరోపించారు. ఈ విషయంలో దయచేసి తనకు న్యాయం చేయాలని ఆమె స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

తన భర్తను తాను ఎందుకు వదిలిపెట్టాను అన్నది తన వ్యక్తిగతమని ఆమె వెల్లడించారు. రోజా వ్యవహరించిన తీరును ప్రశ్నించడమే తన తప్పా అని నిలదీశారు. తాను గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చానని. చంద్రబాబు నాయుడు దయతో ఎమ్మెల్యే అయ్యానని చెప్పుకొచ్చారు. తనకు ఇద్దరు కూతుళ్లని వాళ్లదగ్గర ఎలా మాట్లాడాలో తనకు అర్థంకావడం లేదని ఎమ్మెల్యే అనిత ఆవేదన చెందారు. జగన్ మోహన్ రెడ్డి గారు అలాంటి అసభ్య మాటలు మాట్లాడిన ఎమ్మెల్యే కోసం రెండు రోజులు సభ నుండి వెళ్లిపోయారా అని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదన్నారు. తన హక్కులను కాపాడాలని స్పీకర్ ను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Anitha  Anitha  TDP  Roja  AP  Assembly  Chandrababu Naidu  YS Jagan  

Other Articles