After LK Advani Arun Jaitly said Modi

After lk advani arun jaitly said modi

Modi, Arun Jaitly, Modi on Arun Jaitly issue, DDCA, Aap, Congress, Ajay KMaken

In his first comment on the latest crisis to hit his government, Prime Minister Narendra Modi told BJP lawmakers this morning that Finance Minister Arun Jaitley would "come through with flying colours," from the Delhi cricket board controversy.

నాడు ఎల్.కె అద్వానీ నేడు అరుణ్ జైట్లీ అట

Posted: 12/22/2015 01:21 PM IST
After lk advani arun jaitly said modi

'హవాలా కుంభకోణం బయట పడినప్పుడు మన పార్టీ కురువృద్ధుడు ఎల్.కె అద్వానీపై కూడా ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీలు ఇలాగే గోలగోల చేశాయి... కానీ చివరికి అద్వానీజీ కడిగిన ముత్యంలా బయటికి వచ్చారు. ఆయనపై మోపిన ఆరోపణలన్నీ పటాపంచలయ్యాయి... ఇప్పుడు అరుణ్ జైట్లీ విషయంలోనూ అదే జరుగుతుంది. డీడీసీఏ వివాదం నుంచి ఆయన కచ్చితంగా, స్వచ్ఛంగా బయటపడతారనే నమ్మకం ఉంది'. ఇదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలతో అన్న మాట. మంగళవారంనాడు పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు బీజేపీపీపీ కార్యాలయంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీల సమావేశం జరిగింది. భేటీ అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు.

హవాలా కేసు నుంచి అద్వానీ బయటపడినట్టే, డీసీసీ వివాదం నుంచి అరుణ్ జైట్లీ బయటపడతారని ప్రధాని అన్నారని వెంకయ్య తెలిపారు. కేవలం ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలుచేసేందుకే విపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు. ఇప్పుడు జైట్లీని టార్గెట్ చేసినట్లే గతంలో సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ లపై కూడా కాంగ్రెస్ నాయకులు నిందారోపణలు చేశారని వెంకయ్య దుయ్యబట్టారు.కాగా మోదీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ భిన్నంగా స్పందించింది. హవాలా కేసులో అద్వానీపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మరి జైట్లీ కూడా తన పదవికి రాజీనామా చేస్తారా అని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ప్రశ్నించారు. డీడీసీఏ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలంటే అరుణ్ జైట్లీ రాజీనామా చేయాల్సిందే అని మాకెన్ అభిప్రాయపడ్డారు. అద్వానీతో జైట్లీని పోల్చడం అంటే ప్రధాని మోదీ అదే కోరుకుంటున్నారా అని మాకెన్ తన ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Arun Jaitly  Modi on Arun Jaitly issue  DDCA  Aap  Congress  Ajay KMaken  

Other Articles