KCR is the second person who is doing Yagam

Kcr is the second person who is doing yagam

KCR, Yagam, Ayaatha Chandi Yagam, Telangana

Telangana CM KCR is doing Ayata Chandi Yagam . He said that he is the second person who is doing this Yagam.

యాగం చేస్తున్న రెండో వ్యక్తి కేసీఆర్..!

Posted: 12/21/2015 09:20 AM IST
Kcr is the second person who is doing yagam

లోక కళ్యాణం కోసమే అయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశలంలో ఈ యాగాన్ని నిర్వహించే రెండో వ్యక్తి తానేనని చెప్పారు. దేశంలో ఇంతవరకు శృంగేరి పీఠం సారథ్యంలో మాత్రమే ఈ యాగాన్ని జరిపినట్లు తెలిపిన కేసీఆర్ రెండో వ్యక్తిగా ఈ యాగాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గతంలో కాకతీయుల కాలంలో యాగం నిర్వహించినట్లు చెబుతున్నప్పటికీ, తగిన ఆధారాలు ఏమీ లేవన్నారు. ఈ యాగానికి మొత్తం ఖర్చు తానే స్వయంగా భరీస్తున్నానని తెలిపిన ముఖ్యమంత్రి.. యాగానికి ఖర్చు తక్కువేనని, కానీ ఏర్పాట్లుకు మార్గం ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుందన్నారు. తాను కూడా ఓ కార్యకర్తలా యాగానికి సంబంధించిన అన్ని పనులు చూసుకుంటున్నానని తెలిపారు.

యాగం చేసే రుత్విజులు అందరూ చాలా పవిత్రంగా, నిష్టగా ఉంటారని… వారు ఎవ్వరిని తాకకుండా యాగం నిర్వహిస్తారని… ఒక వేల ఎవరైనా తాకితే రుత్విజులందరూ స్నానమాచరించాల్సి ఉంటుందన్నారు. తాను కూడా మూడు రోజుల పాటు ఉపవాస దీక్ష చేపడుతున్నట్లు కేసీఆర్ వివరించారు. యాగం విజయవంతంగా పూర్తి అయితే లోకాభివృద్ధికి దోహదపడుతుందని, అనుకోకుండా ఏదైనా లోపం జరిగితే ఆ దుష్పలితాన్ని సంకల్పం తీసుకున్నవారు అనుభవించాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పుకోచ్చారు. యాగంలోకి ఉపయోగించే సుమారు 400 క్వింటాళ్ల నెయ్యిని మిత్రుడు ఒకరు గుజరాత్ నుంచి పంపిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Yagam  Ayaatha Chandi Yagam  Telangana  

Other Articles