We have become too tolerant to accept problems

We have become too tolerant to accept problems

Nana Patekar, Indians, Tolerant, Farmers, Suicides, India, Nana Patekar on tolerance

Lamenting the present day condition of the people, veteran actor Nana Patekar has said Indians have become too tolerant to accept the existing problems in the country like rampant farmer suicides. Patekar, while speaking at a function here to felicitate ex-army men, said it is only the people who have changed, else the sorry state of the country remains the same.

భారతీయుల సహనం ఎలాంటిదో చెప్పిన నానాపాటేకర్

Posted: 12/18/2015 08:39 AM IST
We have become too tolerant to accept problems

రైతుల ఆత్మహత్యలతోపాటు దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను, సమస్యలను భరించడంలో భారతీయ ప్రజలకు చెప్పలేనంత సహనం ఉందని బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ వ్యంగ్యాస్ర్తాలను సంధించారు. దేశ ప్రజల ప్రస్తుత స్థితిగతులపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవు అని పాటేకర్ ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం మాజీ సైనిక ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో సగటు మానవులకు సంబంధించిన అనేక సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లు అనే రీతిలో ఉన్నాయని అన్నారు.

మనచుట్టు ఉన్న పరిస్థితులపై ఇంకా సహనం పాటించడం సిగ్గుచేటు, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు మనమే కారణమని ఉద్వేగంతో ప్రసంగించారు. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న రైతులు మనోధైర్యాన్ని కోల్పోయి.. ఆత్మహత్యలకు పాల్పడకూడదని నానా పాటేకర్ విజ్ఞప్తి చేశారు. గతంలో నానా పాట్కర్ మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారికి దైర్యం ఇచ్చారు. జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయని.. తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nana Patekar  Indians  Tolerant  Farmers  Suicides  India  Nana Patekar on tolerance  

Other Articles