Netaji met ex PM Lal Bahadur Shastri in Tashkent

Netaji met ex pm lal bahadur shastri in tashkent

Netaji, SUbhash Chandra Bose, Bose, netaji Alive, Tashkent, Forensic Lab, Lal Bahadur Shashtri

A forensic face-mapping report submitted by a British expert, which is yet to be wholly ascertained, has found strong resemblance between a man – sharing space with the former prime minister Lal Bahadur Shashtri in a photograph clicked in Tashkent – and Netaji Subhas Chandra Bose.

తాష్కంట్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్..?

Posted: 12/14/2015 08:36 AM IST
Netaji met ex pm lal bahadur shastri in tashkent

స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో విమానప్రమాదంలో మరణించారని అంటారు. అయితే ఈ సంఘటన జరిగిన 20ఏళ్లకు 1966లో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిగారు తాష్కంట్ లో ఇండో-పాక్ శాంతి చర్చలకు వెళ్ళినప్పుడు తీసిన ఒక గ్రూప్ ఫోటోలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనిపించారు ! ఇది ఎలా సాధ్యం ? మరణించినట్లు ప్రకటించిన వ్యక్తి 20ఏళ్ల తర్వాత గ్రూప్ ఫోటోలో ఎలా కనిపిస్తారు!! ఫోటోలో ఉన్నది నేతాజీనేనా ? లేక అలాంటి పోలికలున్న మనిషా ?? అన్న సందేహం ఇప్పుడు దాదాపుగా తేలిపోయింది. నేతాజీ మరణంపై నిజానిజాలను వెలికితీసే ప్రయత్నంలో `ఫోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్ ‘ నిర్ధారణ జరిగింది.

ఒక బ్రిటీష్ నిపుణుడు `ఫోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్’ పద్ధతి ద్వారా లాల్ బహదూర్ శాస్త్రి, మరికొందరు ప్రముఖులతోపాటుగా ఉన్నది నేతాజీనేనని తేల్చి చెప్పాడు. నివేదికను కూడా అందజేశాడు. నేతాజీ మరణంలోని మిస్టరీని చేధించేందుకు ఏర్పడిన పరిశోధకుల బృందం చేతికి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రితో కూడిన ఒక గ్రూప్ ఫోటో చిక్కింది. చాలా ఆశ్చర్యకరంగా ఆ గ్రూప్ ఫోటోలో రెండవ వరసలో కుడివైపున వెనక నిలబడిన వ్యక్తి (ముఖం మాత్రమే కనబడేలా ఉన్న వ్యక్తి) అచ్చు గుద్దినట్లు నేతాజీలాగానే ఉన్నారు. ఈ ఫోటో 1966లో లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ కు వెళ్ళినప్పుడు తీసింది.

3. పోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్ పద్ధతిలో బ్రిటన్ కు చెందిన నీల్ మిల్లెర్ ఆ ఫోటోని నెలరోజులపాటు క్షుణ్ణంగా పరిశోధించి, పరిశీలించి చివరకు సుబాష్ చంద్రబోస్ ఫోటో, ఈ గ్రూప్ ఫోటోలో కనబడతున్న వ్యక్తి ఒకేలా ఉన్నారని తన నివేదికలో స్పష్టం చేశారు. ఇద్దరు వేరువేరుకారనీ, ఒక్కరే అని తేల్చిచెప్పారు. నవంబర్ 2015లో నివేదిక కూడా అందజేశారు. అదిప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని మోదీ ఆమధ్య నేతాజీ కుటుంబసభ్యులను కలుసుకున్నప్పుడు తాను రష్యావెళ్ళినప్పుడు నేతాజీ ఫైళ్ల గురించి పుతిన్ తో మాట్లాడతానని చెప్పారు. మరి ఇప్పుడు ఫోటో మ్యాపింగ్ నివేదికతో, 1966 తాష్కంట్ సమావేశంలో నేతాజీ ఉన్నట్లు తేలిపోవడంతో వాస్తవమేమిటో తేల్చుకునే సమయం ఆసన్నమైందనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Netaji  SUbhash Chandra Bose  Bose  netaji Alive  Tashkent  Forensic Lab  Lal Bahadur Shashtri  

Other Articles