Telangana Minister KTR tweeted VDP survey

Telangana minister ktr tweeted vdp survey

TRS, MIM, Telangana, GHMC, Elections, KTR, KTR Tweets on GHMC Elections, VDP Associates, TRS Party in Telangana

Telangana Minister KTR tweeted VDP survey. On GHMC elections, TRS party may get full majority. in the VDP Assosiates survey TRS may get 70 seats.

గ్రేటర్ లో టిఆర్ఎస్ గ్రేట్ విక్టరీ.. కేటీఆర్ ట్వీట్

Posted: 12/14/2015 09:39 AM IST
Telangana minister ktr tweeted vdp survey

గ్రేటర్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్దపడుతున్నాయి. అధికార పార్టీ టిఆర్ఎస్ సహా అన్ని పార్టీలు హైదరాబాద్ లో తమ బలాన్ని నిరూపించుకునేందుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే తెలంగాణలో ఎలాగైతే తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ ఎదిగిందో.. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పార్టీ విజయబావుటా ఎగరవేస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వే ఆధారంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసకొని... జిహెచ్ఎంసీలో విజయబావుటా ఎగరవేస్తుందని అంటున్నారు. అందుకు సాక్షంగా కేటీఆర్ సర్వే నివేదికను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత బలం ఉందో తెలుసుకోవడానికి విడిపి అసోసియేట్స్ ప్రిసర్వే నిర్వహించింది. జిహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో సర్వే నిర్వహించిన విడిపి అసోసియేట్స్... ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలిపింది. ఆ సర్వేలో అధికార టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని విధంగా గెలుపును సొంతం చేసుకుంటుందని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం టిఆర్ఎస్ 70 సీట్లు సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంటుందని తేలింది. అలాగే మిలిగిన పార్టీలైన ఎంఐఎం 42 డివిజన్లలో, కాంగ్రెస్ పార్టీకి 16 డివిజన్లలో, టిడిపికి 11, బిజెపికి 8 ఇతరులకు 3 డివిజన్లలో విజయం చేకూరుతుంది. మొత్తంగా టిఆర్ఎస్ గెలుపు ఖాయమైందని తెలుస్తోంది. మరి చూడాలి నిజంగా ఇదే జరుగుతుందా లేదంటే ఫలితాలు మారతాయో..?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  MIM  Telangana  GHMC  Elections  KTR  KTR Tweets on GHMC Elections  VDP Associates  TRS Party in Telangana  

Other Articles