Something happened in the Swarna Bar

Something happened in the swarna bar

Liquior, Swarna Bar, AP, Cheap liquior, Chandrababu Naidu, Malladi, Kollu Ravindra

Five members died in the Vijayawada cheap liquior incident. Foresnsic lab gave report that there is no fault in liquior.

స్వర్ణ బార్ లోనే మతలబు జరిగింది..!?

Posted: 12/11/2015 08:19 AM IST
Something happened in the swarna bar

విజయవాడలో కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ఎక్సైజ్ శాఖ నిషేధించిన బ్రాండ్ల మద్యంలో కల్తీ జరగలేదని తేలింది. దీంతో ఐదుగురి ప్రాణాలు బలిగొన్న స్వర్ణ బార్ లో మాత్రమే కల్తీ జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. మరోవైపు ఈ ఘటనకు బాధ్యుడిగా విజయవాడ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ పై ప్రభుత్వం వేటు వేసింది విజయవాడలో కల్తీ మద్యం ఘటన వెలుగు చూశాక ఎక్సైజ్ శాఖ మేల్కొంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేసింది. దాదాపు 9 బ్రాండ్లను సీజ్ చేసింది. అయితే వీటి శాంపిల్స్ ను పరీక్షించిన రీజనల్ కెమికల్ లేబొరేటరీ మాత్రం ఆ బ్రాండ్లలో కల్తీ జరగలేదని తేల్చి చెప్పింది. దీంతో.. ఇప్పుడు కల్తీ వ్యవహారం అంతా.. స్వర్ణ బార్ కు చుట్టుకోబోతోంది.

విజయవాడలో కల్తీ మద్యం ఘటనను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు సర్కార్... ఎక్సైజ్ శాఖపై కన్నెర్ర చేసింది. ఈ ఘటనపై విచారణకోసం సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ బార్ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకు చెందినది కావడంతో ఇష్యూ కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఓవైపు సిట్ విచారణ, మరోవైపు నేతల మాటల యుద్ధం కొనసాగుతుండగానే... రీజినల్ కెమికల్ లేబొరేటరీ ఇచ్చిన నివేదిక.. కేసును మరో మలుపు తిప్పింది. మద్యం శాంపిళ్లను పరిశీలించిన లేబొరేటరీ... ఎక్సైజ్ శాఖకు నివేదిక ఇచ్చింది. నిషేధించిన 9 బ్రాండ్ల మద్యంలో పరిమితికి మించి మిథైల్ ఆల్కహాల్ లేదని రిపోర్ట్ లో తేల్చి చెప్పింది. దీంతో విజయవాడలో మాత్రమే మద్యం కల్తీ జరిగినట్లు అనుమానాలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా స్వర్ణ బార్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇపుడు విచారణ కూడా ఈ బార్ చుట్టూనే కొనసాగే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Liquior  Swarna Bar  AP  Cheap liquior  Chandrababu Naidu  Malladi  Kollu Ravindra  

Other Articles