Bombay HC acquits Salman Khan of all charges in hit-and-run-case

Salman khan acquitted of all charges in hit and run case

salman khan, salman khan case, salman khan verdict, hit and run case verdict, hit and run case, salman khan hit and run case, salman case verdict, salman khan case verdict, bombay high court, high court verdict on salman khan, salman khan news, land cruiser news

Salman Khan hit-and-run case: According to the Bombay High Court, the prosecution failed to prove that the actor was drinking and moreover driving the vehicle on the night of the accident.

బొంబే హైకోర్టులో సల్మాన్ ఖాన్ కు ఊరట...

Posted: 12/10/2015 05:23 PM IST
Salman khan acquitted of all charges in hit and run case

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసు నుంచి సల్మాన్ బయటపడ్డాడు. ఈ కేసులో ఆయన్ను దోషిగా నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ చూపుతున్న ఆధారాలు సరిపోవని అభిప్రాయపడ్డ బాంబే హైకోర్టు, ట్రయల్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సల్మాన్ పై నమోదైన అన్ని అభియోగాలనూ కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. ఈ తీర్పు వెలువడే సమయంలో సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు కోర్టులోనే మౌనంగా కూర్చుని ఉన్నారు. కోర్టు బయట భారీ సంఖ్యలో చేరిన సల్మాన్ అభిమానులు తీర్పు తరువాత సంబరాలు జరుపుకున్నారు.

 2002 సెప్టెంబర్ 28న వైల్ పార్లేలోని  'రాణి బార్ అండ్ రెస్టారెంట్'లో మద్యాన్ని సేవించిన సల్మాన్ టయోటా లెక్సస్ వాహనాన్ని నడుపుతూ ఓ షాపులోకి దూసుకెళ్లాడని, దీంతో ఆ షాపు ఎదురుగా పడుకున్న ఓ వ్యక్తి చనిపోగా, నలుగురు గాయపడ్డారని అభియోగాల నేపథ్యంలో దిగువకోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను బొంబాయి హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రవీంద్ర పాటిల్ వాదనను పూర్తిగా నమ్మలేమని హైకోర్టు పేర్కొంది. ఘటన జరిగిన సమయంలో సల్మాన్ తాగి వాహనం నడుపుతున్నాడనే అంశాన్ని సందేహాలకు తావులేకుండా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని పేర్కొంది. దీంతో సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా విడుదల చేసింది.

పదమూడు సంవత్సరాల నాటి కేసు నుంచి విముక్తిని పొందిన అనంతరం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. మధ్యాహ్నం నుంచి కోర్టు హాల్లో, తన కుటుంబ సభ్యులతో కలసి కూర్చుని ఉన్న సల్మాన్ గంభీరంగా కనిపించాడు. న్యాయమూర్తి తీర్పు వెలువరించిన తరువాత, ఆయన బంధువులు ఒక్కసారిగా చుట్టుముట్టగా, సల్మాన్ కంట కన్నీరు కారింది. తన వారిని పట్టుకుని ఆయన బోరున విలపించాడు. కాగా, సల్మాన్ ఇంకొంతసేపు కోర్టులో ఉండాల్సి వుంది. బెయిలు బాండును క్యాన్సిల్ చేయించే పని ముగిసేవరకూ కోర్టులో ఉంటారని సల్మాన్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  hit-and-run case  Bombay high court  

Other Articles