holiday for children due to cm chandrababu meeting

Schools asked to close for babu s visits

Schools, Babu, vijayawada, andhra pradesh, chandrababu naidu, rtc, CM Meeting, Holiday for children, schools declared holiday, private school buses cm meeting, vijayawada, mangalgiri

Schools were ordered to close down and over 200 school buses were requisitioned for a public meeting of Andhra Pradesh chief minister N Chandrababu Naidu.

‘బాబు’ గారి రాక కోసం బడులు బంద్..! బస్సులన్నీ వెడలె సీఎం సభలకు..!!

Posted: 12/05/2015 09:41 AM IST
Schools asked to close for babu s visits

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ అనగానే భారీగా ప్రజలు ప్రత్యక్షం అవుతున్నారు. ఇంత మంది ప్రజలను ఎలా సమీకరిస్తున్నారా..? అన్న ఎన్నికలు కూడా లేని తరుణంలో ఇంత మంది ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్న సహజరంగానే వస్తుంది. ఇదిలావుండగానే బాబుగారి సభలు అనగానే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు హడలిపోతున్నాయి. ఎందుకంటే ఆయన సభలకు వినియోగిస్తున్నది తమ వాహనాలే కావడంతో.. ఇవ్వమని చెప్పలేక.. తీసుకెళ్లండని మనస్పూర్తిగా చెప్పలేక మింగలేని, కక్కలేని స్థితికి గురవుతున్నారు. వీటిల్లో ప్రభుత్వ పథకాలు కోసం అర్జీఃలు పెట్టుకున్న వారి నుంచి అంగన్ వాడీ కేంద్రాల మహిళలను, డ్వాక్రా సంఘాల మహిళలను పెద్ద సంఖ్యలో సభలకు తరలిస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రభుత్వం సభలకు ఆర్టీసీ బస్సులను వినియోగించగా వారికి కోట్లాది రూపాయలు బకాయిలు పేరుకుపోవడంతో ట్రెండ్ మార్చారు. కొద్ది రోజులుగా ప్రైవేటు స్కూల్స్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. గత నెల వ్యవధిలో జిల్లాలో 8 సార్లు సీఎం పర్యటించగా ఐటిందిటి ఆర్టీసీ బస్సులను ఉపయోగించగా, చివరి 3 కార్యక్రమాలకు ప్రైవేటు స్కూల్స్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.

మరి పాఠశాల విద్యార్థులు ఎలా వస్తురన్న అనుమానం రావడం సహజమే. అందుకనే పాఠశాల విద్యార్థులకు అకారణ సెలవును ప్రకటిస్తున్నారు. అకారణ సెలవుల కారణంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆదివారాలలో పాఠశాలలను నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్సెషల్ క్లాస్ లకు కొందుకు విద్యార్థులు హాజరుకావడం లేదు. ఇక మరికోందరు విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఆదివారం తరగతులుకు పంపడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు.
 
పాఠశాలల పని దినాల్లో ఎలాంటి ఇతర పనులకు సెలవు ప్రకటించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా, సాక్షాత్తూ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సైతం స్కూల్ బస్సులను వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసినా.. జిల్లా ఉన్నతాధికారి మాత్రం సీఎం సభకు అంటేనే విద్యా, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రైవేటు స్కూల్స్ నుంచి బస్సులు ఏర్పాటు చేయాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. దీంతో మండల అధికారులు తమ ప్రతాపాన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చూపుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  CM Meeting  Holiday for children  

Other Articles