Delhi to Limit Use of Cars in an Effort to Control Pollution

Delhi to limit use of cars in an effort to control pollution

Delhi, Pollution, Delhi High court, Kejriwal, Kejriwal on Pollution control, Delhi Traffic, Delhi Pollution control

The notoriously polluted air in the Indian capital has become so bad that the local government is planning to limit the use of private cars to alternate days, among other measures. K.K. Sharma, the chief secretary of Delhi, told reporters on Friday that starting Jan. 1, the days when a private car would be allowed on the streets would depend on whether its license plate ended in an even or odd number. He did not say how the rules would be enforced.

వాయు కాలుష్యం నియంత్రణకు దిల్లీ సర్కార్ ప్లాన్

Posted: 12/05/2015 09:32 AM IST
Delhi to limit use of cars in an effort to control pollution

దేశ రాజదాని దిల్లీలో పరిస్థితి దారుణంగా మారింది. అక్కడి వాతావరణం అంతకంతకు కాలుష్యంబారిన పడుతుండటంతో గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే తాజాగా కేజ్రీవాల్ ప్రభుత్వం దీని మీద నివారణ, నియంత్రణ చర్యలకు పూనుకుంది. వాహనాల కారణంగా పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ముందుగా చర్యలకు ఉపక్రమించింది. వాహన రిజిస్ట్రేషన్ నంబర్ చివరి అంకె సరి సంఖ్యనా లేదా బేసి సంఖ్యా అనే అంశం ఆధారంగా రోడ్లపైకి వాహనాలను రోజు విడిచి రోజు అనుమతించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ విధానాన్ని 2016 జనవరి 1 తేదీ నుంచి అమల్లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఈ విధానం ద్వారా ఒక వాహనం రాజధానిలో 15 రోజులు మాత్రమే తిరిగే అవకాశముంటుంది. ఈ విధానం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నట్లు గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఢిల్లీలో కాలుష్య సమస్య భయంకరంగా పెరిగిపోవడంపై హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేశాయి. దేశరాజధానిలో ప్రాణాంతకంగా మారిన కాలుష్యాన్ని నివారించేందుకు ఈ నెల 21లోగా కార్యాచరణ రూపొందించాలని దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సరి సంఖ్యతో ముగిసే నంబర్ ప్లేట్ ఉన్న ప్రైవేట్ వాహనాలను ఒక రోజు, బేసి సంఖ్యతో ముగిసే నంబర్ ప్లేట్ ఉన్న వాహనాన్ని మరుసటి రోజు రోడ్లపైకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ నిబంధన ప్రభుత్వ వాహనాలకు వర్తించదని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది శీతాకాలంలో కాలుష్యస్థాయి రెట్టింపగుతున్నదని, కొద్దికాలంపాటు సరి, బేసి సంఖ్యలున్న వాహనాలను ప్రత్యామ్నాయ రోజుల్లో నడుపాలని నిర్ణయించారు. థర్మల్ కేంద్రాలను కూడా మూసివెయ్యాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా మెట్రో, మిగిలిన ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని కూడా దిల్లీ సర్కార్ నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles