Police filed a case on Aamir Khan couple

Police filed a case on aamir khan couple

Aamir Khan, Aamir khan on intolerance, india, intolerance, Aamir Khan statements intolerance, kiran rao, modi govt, parliament

Police filed a case on Aamir Khan couple. Aamir khan gave contraversial statements on intolerance, some body complaints on Aamir khan for his statements

అమీర్ ఖాన్, కిరణ్ రావుల మీద కేసు నమోదు

Posted: 12/04/2015 07:04 PM IST
Police filed a case on aamir khan couple

దేశాన్ని కుదిపేసిన అమీర్ ఖాన్ అసహనం వ్యాఖ్యల మీద దుమారం ఇంకా నడుస్తోంది. దేశంలో అంతకంతకు అసహనం పెరుగుతోందని.. తన బార్య ఒక దశలో దేశం వదిలివెళ్దామని అందని బాలీవుడ్ స్టార్ అమీర్ కాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని రేపాయి. అయితే దిల్లీలో ఇప్పటికే అమీర్ ఖాన్ మీద ఓ కేసు నమోదు కాగా తాజాగా అమీర్ ఖాన్ దంపతుల మీద కేసు నమోదైంది. ముజఫర్‌పూర్ జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ముజఫర్‌పూర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అమీర్‌ఖాన్ దంపతులు దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది సుధీర్‌కుమార్ ఓజా కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై స్పందించిన ముజఫర్‌పూర్ జిల్లా చీఫ్ మేజిస్ట్రేట్ సుష్మా త్రివేది జారీచేసిన ఆదేశాల మేరకు అమీర్‌ఖాన్ దంపతులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

Also Read: ఐదు లక్షల రూపాయలకు అమీర్ ఖాన్

పోలీసులు అమీర్‌ఖాన్ దంపతులపై ఐపీసీ సెక్షన్ 153,153ఏ,153బీ, 154 కింద కేసు నమోదు చేశారు. దేశంలో పరిస్థితులను చూస్తుంటే అసహనం తీవ్రంగా పెరిగిపోయినట్టు కనిపిస్తుందని..తాము దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నామని అమీర్‌ఖాన్ దంపతులు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమీర్ ఖాన్ దంగల్ షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నాడు. కాగా అమీర్ ఖాన్ వ్యాఖ్యలు పార్లమెంట్ లో కూడా తీవ్ర చర్చకు తెర తీశాయి. మొత్తంగా అమీర్ ఖాన్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh