Maharashtra temple purifies idol after woman offers puja

Maharashtra temple purifies idol after woman offers puja

Tradition, Women enters Tample, Shani Bhagawan, Shani Temple, Maharastra, Shani Temple in Maharastra

A Lord Shani temple in Ahmadnagar district of Maharashtra performed a ‘purification puja’ on Sunday after a young woman offered worship to the idol placed on a platform from where women are traditionally barred. Authorities at the Shani Shingnapur temple also suspended seven workers for “negligence” while one trustee resigned taking moral responsibility.

అపచారం: ఆ గుడిలోకి మహిళ ప్రవేశం

Posted: 11/30/2015 02:55 PM IST
Maharashtra temple purifies idol after woman offers puja

దేవాలయాలకు వెళ్లేందుకు ఎక్కడా కూడా నియమ నిబంధనలు లేవు.. కానీ ఎంతో కాలంగా అక్కడ కొనసాగుతూ వస్తున్న ఆచారాలను మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. అయితే తాజాగా ఓ ఆలయంలోకి మహిళ ప్రవేశించడంతో అపచారం చోటుచేసుకుంది. దాదాపు 500 ఏళ్లుగా ఆ ఆలయంలోకి ఆడవాళ్లు ఎవరూ కూడా అడుగుపెట్టలేదు.. కానీ ఓ అమ్మాయి మాత్రం అక్కడికి వెళ్లి పూజలు చేసింది. దాంతో ఆలయ సిబ్బంది మీద వేటు వెయ్యడంతో పాటుగా.. ఆలయాన్ని శుద్ది చేసి పూజలు నిర్వహించారు. అదేంటి మహిళ ప్రవేశిస్తే అంతలా హడావిడి చెయ్యాలా అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవండి.

కొన్ని ఆలయాలు మినహాయిస్తే.. అన్ని ఆలయాల్లోకి మహిళలే ఎక్కువగా వెళ్తుంటారు. ఆ కొన్నింటిలో శని ఆలయం ఒకటి. కొన్ని చోట్ల శని ఆలయాల్లోకి మహిళలకు ప్రవేశం లేదు. అయితే మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని శని శిష్నాపూర్ ఉన్న శని ఆలయంలోకి మహిళ ప్రవేశించి పూజలు చేసింది. మహిళ శని ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేసినందుకు గానూ ఆలయ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.అంతే కాదు ఏడుగురు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఇక ఆచారాల ప్రకారం ఆలయాన్ని శుద్ధి చేసి పాలతో అభిషేకం చేశారు. అయితే ఆలయ కమిటీ తీరుపై కొన్ని స్వచ్ఛంద సంస్థలు మండిపడుతున్నాయి. శని ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles