india book of records as the place to sahasra

Sahasra enters indian book of records

2 year old cute sahasra, sahasra bhagavad gita slokas, indian book of records, sahasra gita slokas, sahasra indian book of records, sahasra record, sahasra bhagavad gita slokas

A 2 year old cute sahasra, from asifabad, adilabad district entered indian book of records by saying 10 bhagavad gita slokas

ఇండియన్ బుక్ ఆప్ రికార్డ్స్ లో రెండేళ్ల చిన్నారికి చోటు

Posted: 11/21/2015 02:16 PM IST
Sahasra enters indian book of records

రెండేళ్ల చిన్నారి.. ముద్దులోలికే మాటలు వింటే ఆవి విన్నవారికి ఎంత మాట్లాడినా వినాలనే వుంటుంది. ఇక తల్లిదండ్రులకు ఆ ముద్దులోలికే చిన్నారి నోటి నుంచి జాలు వారిన పద్యాలు, గేయాలు వింటే వాటిని రికార్డు చేసిన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి మరి సంబరపడుతుంటారు. మా చిన్నారి ఇవాళ ఇలా చేసింది, ఆ పాట పాడింది అని సంబరపడే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుతుంది. అంతేకాదు వాళ్ల సమీప బంధువులు కూడా చిన్నారులతో సరదాగా గడిపిని క్షణాలను సోషల్ మీడియాలో పెట్టి మరీ వాటిని చూస్తూ ఆనందిస్తారు.

అయితే ఈ చిన్నారి తండ్రి సాప్ట్ వేర్ ఇంజనీర్ అయినా.. అందరిలా కాకుండా తన చిన్నారిని ప్రత్యేకంగా తయారు చేశారు. రెండేళ్ల ప్రాయంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేలా తీర్చిదిద్దాడు. అందుకు అతని భాగస్వామి కృషి కూడా అమోఘం. ఇంతకీ వారు చిన్నారిని ఎలా తీర్చిదిద్దారో తెలుసా..? ఒక్క నిమిషంలో పది భగవద్గీత శ్లోకాలు చెప్పేలా. చాలా మంది పెద్దలకు కూడా అసాధ్యమైనదే అయినా చిన్న ప్రాయంలోనే అలా చిన్నారిలో శ్లోకాల పఠనం చేయించడంలో వారి శ్రమ, ఓర్పు అభినందించాల్సిందే.

ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌కు చెందిన సాయిని సంతోష్-అనూష దంపతుల కుమార్తె సహస్ర ఇలా ఒక్క నిమిషంలోనే పది భగవద్గీత శ్లోకాలు చెప్పి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోచోటు దక్కిందించుకుంది. తండ్రి సంతోష్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండటంతో హైదరాబాద్ నగరంలోని చందానగర్ లో కుటుంబం తాత్కలిక నివాసం ఏర్పచ్చుకున్నారు. స్థానిక క్యూట్ ఎలాండ్ స్కూల్‌లో నర్సరీ చదువుతున్న సహస్ర... గత నెల 14న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఏర్పాటు చేసిన పోటీల్లో ఒక నిమిషంలోనే పది భగవద్గీత శ్లోకాలు చదివి అబ్బురపరిచింది. గతంలో ఒక నిమిషంలో ఎనిమిది శ్లోకాలు చదివిన రికార్డులను అధిగమించినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sahasra  bhagavad gita slokas  indian book of records  

Other Articles