The Bypoll Elections Of Warangal Lok Sabha Started | Kadiyam Srihari | TDP Party

Warangal lok sabha bypoll elections starts

warangal bypoll elections, warangal lok sabha elections, trs party news, kadiyap srihari, kcr latest updates, tdp party news, ysr congress party

Warangal Lok sabha Bypoll Elections Starts : The Bypoll Elections Of Warangal Lok Sabha Started.

వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం

Posted: 11/21/2015 09:48 AM IST
Warangal lok sabha bypoll elections starts

వరంగల్ లోక్ సభ స్థానానికి ఉపఎన్నికకు శనివారం ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 1778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఈవీఎంలపై పార్టీ గుర్తులతోపాటు అభ్యర్థుల ఫోటోను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

ఈ ఉప ఎన్నికల్లో  దాదాపు 15 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలో మొదటిగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరును అధికారులు పుష్పగుచ్ఛం అందజేస్తారు. ఈ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగియనుంది. ఇదిలావుండగా.. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఎన్నికయ్యారు. అయితే ఆయన కేసీఆర్ మంత్రి వర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో.. తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఉప ఎన్నిక అనివార్యమైంది.

మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించడంతోపాటు 626 వెబ్ లైవ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విధుల్లో 9428 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 24వ తేదీన వెలువడనున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : warangal bypoll elections  trs party  kadiyam srihari  

Other Articles