UP shocker: dont go seeking publicity for your disgrace, azam khan to rape victim

Don t go seeking publicity for your disgrace up minister azam khan to rape victim

Azam Khan, Uttar Pradesh, Rape Victim, Crime Against Women (CAW), Uttar Pradesh Minority Welfare Minister Azam Khan, Laxmikant Bajpai, Akhilesh Yadav, Samajwadi Party, Kanpur, ganga ki pukar

Continuing his trend of raising a furore with controversial statements, Uttar Pradesh Minister Azam Khan advised an alleged rape victim who had come to him seeking help

రివర్స్ గేర్.. పబ్లిసిటీ కోసం మంత్రి పాకులాట.. రేప్ బాధితురాలితో వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 11/20/2015 04:04 PM IST
Don t go seeking publicity for your disgrace up minister azam khan to rape victim

వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ తన పబ్లిసిటి కోసం రివర్స్ గేర్ లో వెళ్తుంటారని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే విమర్శించినా.. వాటిని ఏ మాత్రం  ఏ మాత్రం పట్టించుకోని మంత్రిగారు మరోసారి నోటికి పనిచెప్పారు. తనను కలిసేందుకు వచ్చిన ఓ అత్యాచార బాధితురాలిపై మంత్రి మహ్మద్ అజంఖాన్ నోరు పారేసుకున్నారు. శుక్రవారం ఆయన 'గంగా కి పుకార్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన లాయర్ తో పాటు మంత్రిని కలిసేందుకు అత్యాచార బాధితురాలు ప్రయత్నించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు బాధితురాలు ప్రయత్నించగా ఆమెపై ఆజంఖాన్ ఒంటికాలిపై లేచారు.

పబ్లిసిటీ కోసం పాకులాడొద్దంటూ బాధితురాలిపై మండిపడుతూనే ఆయన తన పబ్లిసిటీ కోసం పాకులాడ్డారు. తనకు  జరిగిన అవమానంతో అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తావా లేదా గౌరవంగా పోరాడతావా' అంటూ ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలతో బాధితురాలు అవాక్కయింది. తనకు న్యాయం చేస్తారని వస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. జూలై 27న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్య తీసుకోలేదని బాధితురాలి తరపు న్యాయవాది తెలిపారు. అప్పటి నుంచి న్యాయం కోసం ఆమె పోరాడుతోందన్నారు. కాగా, ఆజంఖాన్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Azam Khan  UP Minister  rape victim  Kanpur  ganga ki pukar  

Other Articles