నన్ను జైల్లో పెట్టండి : రాహుల్ గాంధీ

Rahul gandhi challenged modi on his alligations

రాహుల్ గాంధీ, మోదీ,. రాహుల్ గాంధీ వివాదం, సుబ్రహ్మణ్య స్వామి, Rahul gandhi, rahul gandhi on Modi, Rahul gandi on his Nationality, Subhramanya swamy on Rahul gandhi

రాహుల్ గాంధీ తన మీద వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే జైల్లో పెట్టాలని.. ముందు బిజెపి నాయకులు తన మీద బురద జల్లడం ఆపాలని హితవు పలికారు.

నన్ను జైల్లో పెట్టండి : రాహుల్ గాంధీ

Posted: 11/19/2015 05:06 PM IST
Rahul gandhi challenged modi on his alligations

ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆవా కిరణం రాహుల్ గాంధీ తన మీద వస్తున్న ఆరోపణల మీద స్పందించారు. బిజెపి పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ గాంధీ గురించి బాంబ్ పేల్చారు. రాహుల్ గాందీకి భారతీయ పౌరసత్వాన్ని రద్దు చెయ్యాలని కోరారు. ఇంగ్లాండ్ లోని ఓ కంపెనీకి సంబందించిన దరఖాస్తులో రాహుల్ గాందీ దేశం దగ్గర తాను ఇంగ్లాండ్ పౌరుడినని వెల్లడించినట్లు పత్రాలతో సహా నిరూపించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చెయ్యాలని అతను డిమాండ్ చేశారు. దీని మీద బిజెపి నాయకులు కూడా మండిపడ్డారు. అయితే తన మీద ఇంతలా విమర్శలు వస్తున్నా కానీ స్పందించని రాహుల్ గాంధీ తాజాగా స్పందించారు. మోదీ మీద ప్రతి విమర్శలు చెయ్యడమే కాకుండా.. మోదీ బృందం ఇక మీదటైనా తన మీద విమర్శలు చెయ్యడం మానాలని హితవు పలికారు.

రాహుల్ గాంధీ ఇంగ్లండ్ లోని ఓ కంపెనీకి సంబందించిన పత్రాలలో నేషనాలిటీ అని ఉన్న దగ్గర తాను ఇంగ్లండ్ వ్యక్తిగా రాయడం మీద దుమారం రేగింది.. అయితే రాహుల్ గాంధీ దీని మీద స్పందించారు. తన మీద వస్తున్న విమర్శలను తిప్పి కొట్టారు. తన తాత మీద, నానమ్మ మీద, తండ్రి మీద విమర్శలు చేస్తూనే ఉన్నారని.. చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నానని అన్నారు. మోదీగారు మీరు అధికారంలో ఉన్నారు.. అన్ని ఏజెన్సీలు మీ చేతిలోనే ఉన్నాయి.. కదా. నా మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేవించడం.. ఆరు నెలల్లో నిజాలను వెలుగులోకి తీసుకురండి అని హితవు పలికారు ఒకవేళ తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే జైల్లో పెట్టండి అంటూ సవాల్ విసిరారు రాహుల్ గాంధీ. మరి దీని మీద బిజెపి నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles