తిరుమల శ్రీవారి దర్శనానికి 15 నిమిషాలు చాలు

Only fifteen minusts for tirumala venkataeshwara swamy darshan

Tirumala, Heavy Rains, Rains, Rains in chittoor, venkateshwara Swamy, Lord venkateshwara, తిరుమల, వెంకటేశ్వరస్వామి, శ్రీవారి దర్శనం, శ్రీవారి దర్శనానికి 15 నిమిషాలు

భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తిరుమలలో భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.

తిరుమల శ్రీవారి దర్శనానికి 15 నిమిషాలు చాలు

Posted: 11/19/2015 05:05 PM IST
Only fifteen minusts for tirumala venkataeshwara swamy darshan

కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎంతో మంది.. ఎంతో దూరం నుండి వస్తుంటారు. ఎంత కష్టమైనా కానీ వెంకటేశ్వర స్వామిని కళ్లారా దర్శించుకొోని. మనసారా మొక్కుకొని తరిస్తుంటారు. అయితే కొన్ని సార్లు భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు గంటలు.. ఒక్కోసారి రోజులు కూడా పడుతుంది. కానీ తిరుమలకు ఎంతో కష్టపడి చేరుకుంటే 15 నిమిషాల్లో మాత్రమే దర్శనం లబించేస్తుంది అంటే నమ్ముతారా..? కానీ నమ్మాలి ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి. భారీ వర్షాలు తీరని కష్టాలను తీసుకువచ్చినా కానీ.. తిరుమల వెంకన్న దర్శనం మాత్రం వేగంగా జరిగేటట్లు చేశాయి.

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి 15 నిమషాలు సమయం మాత్రమే పడుతోంది. భారీ వర్షాల కారణంగా తిరుమలలో భక్తుల సంఖ్య తగ్గింది, శ్రీవారి దర్శినానికి తక్కువ సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం అత్యంత కనిష్ఠ స్థాయికి చేరింది. సూమారు 30 వేల మంది భక్తులు మాత్రమే స్వామి వారిని దర్శించుకుంటున్నారు? ప్రతీరోజూ కనీసం 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని తితిదే అధికారులు తెలుపుతున్నారు. రాత్రి సమయంలో శ్రీవారి దర్శనం కేవలం 15 నిమషాలు మాత్రమే పడుతోంది. వర్షాల కారణంగా భక్తుల రాకపోకల కోసం రెండో కనుమ దారికి తితిదే అధికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles