Federal Court judge under review for berating alleged teenage sex assault victim

Alberta judge s sex assault case comments reviewed by top legal body

Robin Camp, sex assault, rape, comments, Federal Court, Canadian Judicial Council, Judge Robin Camp, Robin Camp sexist and disrespectful, Federal Court judge, berating alleged teenage sex assault victim, Alberta judge's sex assault case

Judge Robin Camp is accused of the 'sexist and disrespectful' treatment of a sex assault complainant, Who alleged victim 'why she allowed the sex to happen if she didn't want it?' and 'Why couldn't you just keep your knees together?'

ఇష్టంలేనిదే రేప్ ఎలా జరిగింది..? జడ్జీ నోటిదూల.. ఉద్యోగం ఊస్ట్..!

Posted: 11/15/2015 12:26 PM IST
Alberta judge s sex assault case comments reviewed by top legal body

అసలే అత్యాచారానికి గురై కుంగిపోయి.. పుట్టెడు బాధలో వున్న ఓ 19 ఏళ్ల యువతిని అసంబధ్ద ప్రేలాపణలతో విచారణను ఏకపక్షంగా చేయాలని యత్నించిన ఓ న్యాయమూర్తికి తగిన శాస్తి జరిగింది. తన ప్రశ్నలతో బాధితురాలిని మరింత చిత్రవధ చేయడంతో అతన్ని కెనడా జుడీషియల్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. అతనిపై విచరాణ జరిపి శిక్షిస్తామని కూడా చెప్పింది. ఇది కెనడా దేశంలో ఇటీవల జరిగిన ఘటన. రేప్‌ కేసులో కోర్టుకు వచ్చిన యువతిని ‘రేప్‌ జరిగే సమయంలో నువ్వు మోకాళ్లపై ఎందుకు కూర్చోలేదు? ’అని కెనడా జడ్జి. ప్రశ్నించడంతో ఆ న్యాయమూర్తిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అతనిపై కోర్టులో కూడా కేసులు వేశారు.

వివరాల్లోకి వెళితే.. 2014లో ఓ క్లబ్‌లోని నైట్‌ పార్టీలో ఓ 19 ఏళ్ల యువతి పాల్గొంది. కొంత సమయం తర్వాత బాత్రూమ్‌కు వెళ్లగానే అలెగ్జాండర్‌ స్కాట్‌ అనే వ్యక్తి వెంబడించాడు. బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపును లాక్‌ చేసి ఆమెను దారుణంగా రేప్‌ చేశాడు. ఆ కేసు విచారణకు వచ్చింది. అయితే ఆ జడ్డి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి అనుకూలంగా మాట్లాడాడు. రేప్ జరిగే సమయంలో దానిని నిరోధించడానికి బాధితురాలు ఏం చేసిందని ప్రశ్నించాడు. ఆ సమయంలో బాధితురాలికి సెక్స్ అంటే ఇష్టం కలిగిందేమోనని అనుమానం కూడా వ్యక్తం చేశాడు.

అత్యాచార సమయంలో కాళ్లు దగ్గరకు లాక్కుని సింక్‌లో కూర్చుని ఉంటే అతను రేప్‌ చేయగలిగేవాడు కాదు కదా? అంటూ బాధితురాలని ప్రశ్నించాడు. అంతేకాదు.. బాధితురాలికి ఇష్టం లేకుండా అక్కడ రేప్‌ ఎలా జరుగుతుంది?’ అని నిలదీశాడు. దీంతో సదరు న్యాయమూర్తిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అతణ్ని ఫెడరల్‌ కోర్టు జడ్జి పదవి నుంచి సస్పెండ్‌ చేశారు. అతడి తీరుపై కెనడా జ్యుడీషియల్‌ కౌన్సిల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి న్యాయమూర్తిని శిక్షిస్తామని పేర్కొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Robin Camp  sex assault  rape  comments  Federal Court  Canadian Judicial Council  

Other Articles