Paris Attacks: This is part of Third World War —Pope Francis

Pope francis saddened by paris attacks calls for prayer

pope francis, third world war, Paris Attacks part of Third World War, Pope Francis 'Saddened' by Paris Attacks, paris attacks, islamic state, france, security, act of war

Pope Francis has described the deadly terror attacks on Paris, the capital of France, which left no fewer than 129 people killed, as part of “the Third World War”.

పారిస్ మారణహోమంపై ఫోప్ ఫ్రాన్సిస్‌ సంచలన వ్యాఖ్యలు

Posted: 11/15/2015 11:34 AM IST
Pope francis saddened by paris attacks calls for prayer

పారీస్ మహానగరంపై ఉగ్రవాదులు జరిపిన మారణహోమంపై పోప్‌ ఫ్రాన్సిస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉగ్రవాద దాడులు  దాడిని ‘మూడో ప్రపంచ యుద్ధం’లో భాగంగా ఆయన అభివర్ణించారు. వాటికన్‌ నుంచి ఇటాలియన్‌ బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ అధికారిక టెలివిజన్‌కు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో కనిపించారు. నరమేధాన్ని ఖండించడానికి సరైన పదాల కోసం ఆయన తపనపడ్డారు. అమానవీయ ఊచకోతకు హద్దుల్లేకుండా పోయాయని చెప్పారు.

పారిస్ ఉగ్రవాద బాధితుల్లో తాను కూడా ఒకడినని భావోద్వేగంతో అన్నారు, అమానవీయ దాడులు తనను తీవ్రంగా కలచి వేశాయని విషన్నవదనంతో అన్నారు. వేలంవెర్రి ద్వేషాన్ని ఉగ్రవాదులు ఒళ్లంతా నింపుకొన్నారని వ్యాఖ్యానించారు. ‘‘నేను తీవ్రంగా కలత చెందాను. మనుషులు చేస్తున్న ఇటువంటి పనులను అర్థం చేసుకోలేకపోతున్నాను. వారి దుశ్చర్యలకు ఓ పరిధి లేదు. మతం లేదు. మానవత్వం లేదు. ఇది అమానవీయం’’ అని ఫోప్ ఫ్రాన్సిస్‌ వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paris attacks  pope francis  third world war  islamic state  france  security  act of war  

Other Articles