State of Emergency declared in France after Paris terror attacks

France declares state of emergency after attacks

President François Hollande, France declares state of emergency, France state of emergency, France, emergency, Francois Hollande, international borders, terror attack

France has declared a state of emergency and closed its international borders, in the wake of the most deadly terror attack in the nation’s modern history.

ఫ్రాన్సులో అత్యవసర పరిస్థితి.. అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత..

Posted: 11/14/2015 09:10 PM IST
France declares state of emergency after attacks

పారిస్‌ నగరంలో పుట్ బాల్ అభిమానులను టార్గెట్ గా చేసుకుని మారణహోమం సృష్టించిన ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యం.. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఫ్రాన్సు దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని విధించారు. ఉగ్రవాదుల వరుస దాడుల నేపథ్యంలో ఫ్రాన్సు దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు హూలాండ్‌ ప్రకటించారు. పారిస్‌ కాల్పుల ఘటనపై అధ్యక్షుడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని దాడులకు ఉగ్రవాదులు పాల్పడే అవకాశం ఉందని ఆయన దేశ ప్రజలను హెచ్చరించారు.  

ఎమర్జెన్సీ కొనసాగుతుండటంతో ప్రాన్సు నుంచి మిగతా దేశాలకు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద భారీ స్థాయిలో ఆర్మీని మోహరించింది. అంతర్జాతీయ సరిహద్దులను తాత్కాలికంగా మూసివేశారు. విదేశాలతో ముడిపడివున్న విమానాశ్రాయాలు, రైల్వే, రోడ్డు రవాణాను స్థంభింపజేశారు. రహాదారులతో పాటుగా అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. కాగా, పారిస్‌లో కాల్పులు మనవత్వంపై జరిగిన దాడులని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ఒబామా వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటన తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని జర్మనీ ఛాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌ అన్నారు. ఉగ్రవాదులు జరిపిన దాడిని ఐరాస ప్రధాన కార్యదర్శి బానకీమూన్ ఖండించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : France  emergency  Francois Hollande  international borders  terror attack  

Other Articles