LPG subsidy for consumers with over Rs.10 lakh income to be lifted

Soon the well off may have to forego their lpg subsidy

LPG subsidy, Narendra Modi, M Venkaiah Naidu, NDA Government, Petroleum ministry, GST Bill, Foreign Direct Investment, Subsidy,LPG, Dharmendra Pradhan, income bracket, Direct Benefit Transfer

central government is planning to withdraw subsidy on cooking gas for people with annual income of over Rs.10 lakh, union minister M. Venkaiah Naidu said on Saturday

కేంద్రం కసరత్తు.. ఇక ‘వారికి’ ఎల్పీజీ సబ్సిడీ రద్దు..

Posted: 11/14/2015 07:33 PM IST
Soon the well off may have to forego their lpg subsidy

దేశ ఆర్థిక పరిస్థితిని పురగాభివృద్ది చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక పోదుపు చర్యలను తీసుకుంటోంది. అందులో భాగంగా సంపన్నవర్గాలుగా ముద్రపడిన వారితో పాటు ఉన్నతాదయ వర్గాలకు చెందిన వారికి కూడా పలు ప్రభుత్వ మినహాయింపులను కల్పించనుంది. అదేంటి అంటారా..? ఇకపై వార్షిక ఆదాయం పది లక్షలున్న వారు ఎల్పీజీ సబ్సిడీ వదులుకోవాల్సిందే. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కసరత్తు చేస్తుందని, హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సూచనతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ దిశగా కసరత్తు చేస్తోందని ఆయన వివరించారు. పది లక్షల ఆదాయం ఉన్నవారికి ఎల్పీజీ సబ్సిడీ నుంచి మినహాయింపు కల్పించాలని, వారికి సబ్సీడి రద్దు చేసే విషయమై తమ శాఖ కసరత్తు చేస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్ చెప్పారని ఆయన తెలిపారు. నిజానికి పదిలక్షల వార్షికాదాయం వున్నవారికి సబ్సీడీ ఎందుకని వెంకయ్య ప్రశ్నించారు. ఇప్పటి వరకు 30 లక్షల మంది వినియోగదారులు గ్యాస్ రాయితీని వదులుకున్నారని ఆయన తెలిపారు. పేదలకు సబ్సిడీతో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని వెంకయ్యనాయుడు అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LPG subsidy  Narendra Modi  M Venkaiah Naidu  NDA Government  Petroleum ministry  

Other Articles