karnataka home minister parameshwara creates new controversy by doing sensational comments on gangrape incident | gangrape controversies

Karnataka home minister parameshwara controversial comments on gangrape incident

home minister parameshwara, karnataka gangrape, call center employee gangrape, bangalore gangrape, security guards raped woman in bangalore, bangalore crime news, gangrape incident, parameshwara comments on gangrape

karnataka home minister parameshwara controversial comments on gangrape incident : karnataka home minister parameshwara creates new controversy by doing sensational comments on gangrape incident.

ఆ ‘గ్యాంగ్-రేప్’పై హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 11/14/2015 12:21 PM IST
Karnataka home minister parameshwara controversial comments on gangrape incident

మహిళలపై తరచూ జరుగుతున్న అత్యాచార ఘటనల్ని తగ్గించేలా చర్యలు తీసుకోకుండా కొందరు రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో మరో హోంమంత్రి చేరిపోయారు. ఓ మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడి పరారైన నిందితుల ఆచూకీ కనుగొని, వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. ‘అసలు ఆ సమయంలో ఆమె అక్కడ ఎందుకు వేచి వుందో’నంటూ బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు.

కర్ణాటక రాజధాని బెంగళూరు నడిబొడ్డున టెన్నిస్ క్లబ్ వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులు 34 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటినుంచి నిందితుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర హోంమంత్రి అందరూ షాక్ కు గురయ్యేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ఘటన చాలా దురదృష్టకరం. తుముకూరుకు చెందిన ఓ మహిళ రాత్రి 9.30 గంటల సమయంలో టెన్నిస్ క్లబ్ వద్ద ఉంది. ఆమె టెన్నిస్ నేర్చుకోవాలని అక్కడికి వెళ్లిందన్నారు. కానీ, అసలు ఆ సమయంలో ఆమె అక్కడ ఎందుకు వేచి ఉందన్నదే అసలు ప్రశ్న. మేం అన్ని విషయాల మీద దర్యాప్తు చేస్తున్నాం’ అని హోంమంత్రి పరమేశ్వర వ్యాఖ్యానించారు. హోంమంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మండిపడ్డారు. పరమేశ్వర వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయన ఇలాంటి ప్రకటనలు చేయడం మొదటిసారి కాదని, దీనివల్ల ప్రజల్లోకి సరైన సందేశం వెళ్లదని ఆమె చెప్పారు. ఆయనకు తన పనిమీద ఆసక్తి లేకపోతే వెంటనే దిగిపోవాలని అన్నారు.

ఇదిలావుండగా.. గత నెలలో 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అప్పటి హోంమంత్రి కేజే జార్జి కూడా దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇద్దరే చేస్తే అది గ్యాంగ్ రేప్ ఎందుకు అవుతుందని, కనీసం ముగ్గరు నలుగురు చేస్తే కదా.. అనాల్సింది’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ విధంగా అలా వ్యాఖ్యానించడంతో కొన్నాళ్ల తర్వాత ఆయన స్థానంలో పీసీసీ చీఫ్ పరమేశ్వరను నియమించారు. ఇప్పుడీయన కూడా ఇలా కామెంట్ చేయడంతో పార్టీ పెద్దలు ఆందోళనలో పడిపోయినట్లు సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : home minister parameshwara  karnataka gangrape  security guards gangrape  

Other Articles