police arrested a fraud baba named madduri umashankar in hyderabad who cheated people mainly business persons by collecting crores of money | thief babas

Police arrested a fraud baba in hyderabad who cheated people by collecting crores of money

madduru umashankar, fraud baba umashankar, cheated baba madduri umashankar, fraud baba arrested in hyderabad, baba cheated people by collecting money, fraud baba arrested in hyderabad

police arrested a fraud baba in hyderabad who cheated people by collecting crores of money : police arrested a fraud baba in hyderabad who cheated people mainly business persons by collecting crores of money.

ఆధ్మాత్మిక ముసుగులో కోట్లు కాజేసిన దొంగబాబా

Posted: 11/14/2015 11:20 AM IST
Police arrested a fraud baba in hyderabad who cheated people by collecting crores of money

ఆధ్యాత్మిక ముసుగులో ప్రజల నుంచి డబ్బులు దండుకునే దొంగబాబాల బాగోతాలు ఇప్పటికే ఎన్నోసార్లు బయటపడినప్పటికీ.. వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కుప్పలు తెప్పలుగా దొంగబాబాలు పుడుతూనే వున్నారు. ఈ దొంగబాబాల్నినమ్మొద్దంటూ ఎన్నిరకాలుగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రయత్నాలు చేసినా.. వారిలోనూ మార్పు రావడం లేదు. ఎవరైనా కాస్త మేజిక్ చేసి తమనుతాము బాబాగా పరిచయం చేసుకుంటే చాలు.. అతనికి నీరాజనాలు పలుకుతారు. ఈ బలహీనతను పసిగట్టిన దుండగులు.. బాబాలుగా వేషాధారణ చేసి, డబ్బుల్ని బాగానే కాజేస్తున్నారు. ఈ తరహాలోనే ప్రజల్ని మోసం చేసి కోట్లు కాజేసిన మరో దొంగబాబా బాగోతాన్ని తెలుసుకున్న పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు.

కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన మద్దూరు ఉమాశంకర్ (49) అనే వ్యక్తి పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం 2004లో హైదరాబాద్ నగరానికి వచ్చాడు. తొలుత ఉద్యోగం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇతగాడు.. డబ్బు సంపాదన కోసం ఉమాశంకర్ స్వామి అవతారం ఎత్తాడు. పైగా.. మార్కెట్ లో దొంగబాబాల ట్రెండ్ బాగానే నడుస్తోంది కాబట్టి.. ఆ దిశగా అడుగులు వేశాడు. మొదట జాతకాలు చెబుతూ పరిచయాలు పెంచుకున్నాడు. ఆర్‌కేపురంలో ఉంటూ తన స్నేహితులు దుర్గాప్రసాద్, సీఎంకే.రావు సహకారంతో ‘అవర్ ప్లేస్’ పేరుతో భక్తుల నుంచి డబ్బు వసూలు చేసేవాడు. దీనికితోడు రాజమండ్రి, గుడివాడ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించి... వ్యాపారులను, బడా వ్యక్తులను మోసం చేసి వారినుంచి కాజేసిన డబ్బుతో శంషాబాద్‌లో బినామీ పేర్లతో 4.25 ఎకరాల స్థలాన్ని కొన్నాడు. వీటిని బ్యాంకులో తాకట్టు పెట్టి పెద్దమొత్తంలో రుణాలు తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో అతని చేతిలో మోసపోయిన కొత్తపేట ఇన్‌కాంట్యాక్స్ కాలనీకి చెందిన వెంకటరమణారావు బుధవారం చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దాదాపు 50 మంది బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం పోలీసులు ఉమాశంకర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆధ్యాత్మిక ముసుగులో ఇతను సుమారు రూ. 30-40 కోట్లు వసూలు చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fraud baba umashankar  police arrested cheated baba in hyderabad  

Other Articles