I'll take side of Hindu oppressed against Muslim oppressor: PM

Will stand by you against injustice pm tells hindu community

KARACHI:, Pakistanis, have, equal, rights,, Prime Minister, Nawaz Sharif, prime minister, of, all, Pakistani, citizens, irrespective, of, their, religion,, assures, Nawaz Sharif, Pakistani Hindus, Pakistan

Prime Minister Nawaz Sharif has said that he is the prime minister of all Pakistani citizens irrespective of their religion

హిందువులకు నేను అండ.. కాదన్న వారిపై కఠిన చర్యలు

Posted: 11/12/2015 09:11 PM IST
Will stand by you against injustice pm tells hindu community

పాకిస్థాన్‌లోని హిందువులకు అండగా ఉంటానని, వారిని అణచివేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తెలిపారు. తాను అన్ని వర్గాల వారికీ ప్రధానమంత్రినని చెప్పారు. 'ఒక హిందువును ఒక ముస్లిం వ్యక్తి వేధిస్తే.. ఆ ముస్లింకు వ్యతిరేకంగా నేను చర్య తీసుకుంటాను. పీడనకు వ్యతిరేకంగా నేను హిందువులకు అండగా ఉంటాను' అని షరీఫ్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో మైనారిటీల హక్కులను కాలరాస్తుండటంపై అంతర్జాతీయంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ ఓ హోటల్‌లో జరిగిన దీపావళి పండుగ వేడుకల్లో పాల్గొన్న షరీఫ్ మాట్లాడుతూ 'బలహీన, అట్టడుగు వర్గాల వారికి అండగా నిలబడమని నా మతం నాకు బోధించింది. నిజానికి ఏ మతమైనా అణచివేతకు గురవుతున్న బలహీనవర్గాల వారికి అండగా నిలువాలనే చెప్తుంది' అని చెప్పారు. పాకిస్థాన్‌లో ఉండే వారంతా ఒకే జాతీయులని, అందరూ ఐక్యంగా ఉంటూ.. ఒకరినొకరు సహకరించుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూ కమ్యూనిటీ నేతలతో భేటీ అయిన ఆయన.. మైనారిటీ హక్కులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nawaz Sharif  Pakistani Hindus  Pakistan  diwali celebrations  

Other Articles