Pawan Kalyan in Pancha kattu

Pawan kalyan in pancha kattu

Pawan Kalyan, janasena Party, chandrababu naidu, Pawan Kalyan Met Chandrababu Naidu, Pawan Kalyan with Chandrababu Naidu, Pwan Kalyan on Amaravati, Pawan kalyan on farmers

janasena party President Pawan kalyan in New looks. He came to Vijayawada in Pancha kattu. He will meet ap cm chandra babu naidu. He will discuss about Capital city farmers in Amaravati.

నయా ట్రెండ్: పంచెకట్టులో పవన్

Posted: 11/12/2015 12:03 PM IST
Pawan kalyan in pancha kattu

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఏం చేసినా అది ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తుంది. తాజాగా విజయవాడ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ గెటప్ అందరిని ఆకర్షించింది. తెలుగు వారి హుందా కనిపించేలా పవన్ కళ్యాణ్ పంచ కట్టులో కనిపించారు. గతంలో ఓ సినిమా సీన్ కోసం పంచ కట్టిన పవన్.. లైవ్ లో పంచె కట్టుతో కనిపించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు భూములిచ్చిన రైతులకు పట్టు పంచెలు, దోవతిలు అందించారు. అయితే తెలుగు వారి సంస్రృతిని ఎప్పుడూ పొగిడే పవన్ కళ్యాన్ ఇలా పంచె కట్టులో కనిపించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఎప్పటికైనా పవర్ స్టార్ కు గుడి కట్టేస్తాడట!

ట్రెండ్ ను ఫాలో అవ్వను.. నేనే ట్రెండ్ సెట్ చేస్తాను అని గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా పవన్ ట్రెండ్ సెట్ చేసే వ్యక్తే. రాజకీయాల్లో అడుగుపెట్టనప్పటి నుండి తనదైన పంథాలో ముందుకు వెళుతున్న పవన్ తెలుగు వారి కొత్త గొంతుగా మారారు. అందుకే రాజధాని గ్రామాల్లో రైతులు.. పవన్ ను తమ దైవంగా భావిస్తారు. ఏపి ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కునేందుకు ప్రయత్నించగా.. అందరూ పవన్ రావాలి అంటూ డిమాండ్ చేశారు. తాజాగా మరోసారి రైతు పక్షపాతిగా, ఓ రైతు బిడ్డగా, రైతుగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్, చంద్రబాబు భేటీ మీద తీవ్ర చర్చ జరుగుతోంది. పవన్ భేటీలో ఏఏ అంశాల మీద చర్చిస్తారు అన్న దాని మీద తర్వాత మీడియాకు వెల్లడిస్తానని అన్నారు.

Also Read: పవన్ కల్యాన్ నివాసం వద్ద గుర్తు తెలియని అగంతకులు హంగామా 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  Farmers  AP  Capital  Amaravati  Chandrababu Naidu  

Other Articles