farners will teach lessons by their footwear

Farners will teach lessons by their footwear

Telangana, Srihari, Depty. CM Srihari, Farmers, Women, Telangana govt

Telanagana govt gaining negitive talk from people. farmers and women are very anger on Telanagan govt. A farmer through his slipper on Telangana Depty. CM Kadium Srihari

ఇక రైతులు చెప్పుతో బుద్ది చెబుతారా..?

Posted: 11/07/2015 10:53 AM IST
Farners will teach lessons by their footwear

నిరసనలు చాలా రకాలు చేస్తుంటారు. అందులో భాగంగా చాలా మంది ర్యాలీలు, ధర్నాలు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం కాస్త అహింసా మార్గంలో తమ నిరసనను వెల్లడిస్తుంటారు. అయితే తాజాగా చెప్పుతో తమ నిరసనను వ్యక్తం చెయ్యడం మామూలైపోయింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి మీద ఓ రైతు తన చెప్పును విసిరి నిరసన వ్యక్తం చేశారు. అయితే అది కడియం శ్రీహరి మీద పడకున్నా కానీ.. అవమానం మాత్రం జరిగింది. అయితే ఎందుకు ఇలా నిరసన గళాలు వినిపిస్తున్నాయి.. అంటే రైతుల్లో వస్తున్న వ్యతిరేకత అని స్పష్టమవుతోంది. రైతులకు న్యాయం చెయ్యడంలో ప్రభుత్వం విఫలమవుతోంది.. దాన్ని నిరసిస్తు ఇలా చెప్పులతో తమ అభిప్రాయాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది.. అలాగే రైతులు తీసుకున్న రుణాల మాఫీ విషయంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. అందుకే రైతుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా మహిళల్లో కూడా వ్యతిరేకత వస్తోంది. గ్రామాల్లో కనీసం తాగునీటి సదుపాయం కూడా కల్పిచడంలో విఫలమయ్యారని.. సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ. రోడ్డు మీద బైఠాయించారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తోంది అన్నది మాత్రం వాస్తవం. కానీ ఆ వ్యతిరేకత మరీ ఎక్కువై చెప్పులతో చెప్పే దాకా రావడం దురదృష్టకరం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Srihari  Depty. CM Srihari  Farmers  Women  Telangana govt  

Other Articles