Allu Arjun applies for voter card in Warangal

Allu arjun applies for voter card in warangal

Allu Arjun, warangal, Allu Arjun Voter card, Allu Arjun allication, Allu Arjun News, Allu Arjun updates, Allu Arjun in warangal, Allu Arjun latest news

We have already seen several film celebrities including Samantha were issued voter's cards in several parts of Telangana.Now, Stylish Star Allu Arjun, who played the role of Gona Gannareddy in Rudramadevi, has applied for a voter card in Warangal east constituency although he does not live there. This was done by some miscreants.

ఓటర్ కార్డ్ కోసం అల్లు అర్జున్ అప్లికేషన్

Posted: 11/06/2015 03:46 PM IST
Allu arjun applies for voter card in warangal

ఓటరు గుర్తింపు కార్డులు లేని వారు వెంటనే.. అప్లై చెయ్యండి.. మీ ఓటు హక్కను వినియోగించయుకోండి అంటూ ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు కొంత మంది ఆకతాయిలు ఎలా స్పందిస్తున్నారో చూడండి.. టాప్ మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్ పేరు మీద ఓటరు గుర్తింపు కార్డు కోసం అప్లై చెయ్యడం వార్తల్లో నిలిచింది. గతంలో కూడా హీరోయిన్ సమంత పేరుతో ఓటర్ కార్డ్ అప్లై చెయ్యడం గతంలో కూడా సెన్సేషన్ గా నిలిచింది. అయితే తాజాగా వరంగల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు స్టైలిష్ స్టార్ పేరుతో ఓటర్ కార్డు కోసం అప్లికేషన్ రావడం విశేషం. ఎవరో ఆ స్టార్ తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవండి.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు, ఫోటోను వాడుతూ ఎవరో ఆకతాయిలు ఆన్ లైన్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారు. ఈ ఘటన వరంగల్ లో జరిగింది. ఖిల్లా వరంగల్ లోని ఇంటి నెంబర్ 16-10-1452లో ఆయన నివాసం ఉంటున్నాడని, వయస్సు 30 సంవత్సరాలా 7 నెలలని  డిటేల్స్ లో వెల్లడించాడు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తును కనుగొన్న అధికారులు విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎన్నికల అదికారి అరుణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అరుణ సైబర్ క్రైమ్  పోలీసులకు ఫిర్యాదు చేయగా,  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles