Modi plan brought problems to rahul gandhi

Modi plan brought problems to rahul gandhi

Modi, Rahul Gandhi, Sikhs, 1984 riots, Rahul Gandhi to faridabad, Modi in Bihar

A day ahead of Rahul Gandhi’s visit to Faridkot to meet the family members of two victims of police firing, the Shiromani Akali Dal (SAD) today asked Congress Vice President to disclose if he had ever visited the family members of the 1984 riots.

మోదీ ప్లాన్.. రాహుల్ కు చిక్కెదురు

Posted: 11/05/2015 08:32 AM IST
Modi plan brought problems to rahul gandhi

మోదీ రాజకీయ చాణిక్యం రాహుల్ గాంధీకి కొత్త చిక్కులు తీసుకువస్తోంది. గో మాంసం, దేశంలో పెరుగుతున్న హింస లాంటి అంశాలతో మోదీని, మోదీ సర్కార్ ను బీహార్ ఎన్నికల్లో దెబ్బతీయాలని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గా:ధీ ప్లాన్ వేశారు. అయితే బీహార్ ఎన్నికల్లో ఇదే ప్రచారాన్ని కూడా చేశారు. మోదీ సర్కార్ వచ్చిన తర్వాత దేశంలో అసహనం, హింస పెరిగాయని కాంగ్రెస్ పార్టీ పదేపదే అంటోంది. అయితే ఎన్నికల టైంలో ఇలా మోదీని కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను మోదీ గట్టిగా ఎదుర్కున్నారు. కాంగ్రెస్ పార్టీ హయంలో సిక్కుల ఊచకోత కోసిన మీరా.. మాకు చెప్పేది అంటూ మోదీ కాంగ్రెస్ ను సందిగ్దంలో పడేశారు.

రాహుల్ గాంధీ ఫరీద్ కోట్ పర్యటనపై శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా స్పందించింది. పోలీసు కాల్పుల్లో మరణించిన ఇద్దరి కుటుంబసభ్యులను ఓదార్చేందుకు రాహుల్ ఈ పర్యటన పెట్టుకున్నారు. దీంతో 1984 సిక్కుల ఊచకోత సందర్భంగా మరణించిన సిక్కుల కుటుంబాల్లో ఏ ఒక్క కుటుంబాన్ని అయినా.. ఎప్పుడైనా రాహుల్ గాంధీ కలుసుకున్నాడా అని నిలదీసింది. ఆనాడు 2,500 మందికి పైగా సిక్కులు బలైతే.. పలకరించని రాహుల్ ఇప్పుడు ఇద్దరు పోలీసు కాల్పుల్లో చనిపోతే ఫరీద్ కోట్ లో రాజకీయం చేయడానికి వస్తున్నాడని శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజిమెంట్ కమిటీ ప్రెసిడెంట్ మంజిత్ సింగ్ జికే. నిలదీశారు. 1984 లో ఊచకోతలో చనిపోయిన కుటుంబాల్లో ఒక్క కుటుంబాన్ని అయినా ఎందుకు పరామర్శించలేక పోయారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఫరీద్ కోట్ ఎంతో దూరం అనీ.. తన ఇంటికి అతి సమీపంలోని ఢిల్లీ తిలక్ నగర్ లో వితంతువుల కాలనీని ఎందుకు వెళ్లలేకపోయారని మంజిత్ సింగ్ తీవ్రంగా ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Rahul Gandhi  Sikhs  1984 riots  Rahul Gandhi to faridabad  Modi in Bihar  

Other Articles