Fifth phase elections in Bihar today

Fifth phase elections in bihar today

Bihar,l Elections, Nitesh Kumar, Modi, Bihar elections fifth phase, lalu prasad, Araria, Darbhanga, Katihar, Kishanganj, Madhepura, Madhubani, Purnia, Saharsa

The last phase of the ongoing five-phase Bihar assembly election will be held on November 5. In this phase, 57 seats are going to the poll. Among all the phases, this one involves the largest number of seats, 57, spread across the districts of Araria, Darbhanga, Katihar, Kishanganj, Madhepura, Madhubani, Purnia, Saharsa and Supaul. So all parties have a big stake in this phase. 24 of these seats fall in the ‘Seemanchal’ region, bordering West Bengal.

నేడు బీహార్ లో అంతిమ యుద్ధం

Posted: 11/05/2015 08:19 AM IST
Fifth phase elections in bihar today

దేశంలో ఎన్నికల ప్రచారంలో కొత్త పర్వానికి తెర తీసిన బీహార్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఐదు విడతల ఎన్నికల్లో భాగంగా నేడు జరిగే ఐదో విడతతో ఎన్నికల పర్వం చివరి అంకానికి చేరింది. ఈ దశతో బీహార్ శాసనసభకు ఎన్నికలు పూర్తయినట్లే. ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల ఎన్నికలు ఒక ఎత్తయితే ఈ దశ ఒక్కటీ మరో ఎత్తు. నేడు పోలింగ్ జరిగే 57 నియోజవర్గాలు కూడా ముస్లింలు, యాదవులే నిర్ణేతలుగా వ్యవహరించే ప్రాంతాలు. సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా యాదవ సామాజికవర్గమే కావడంతో మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఈ నియోజవర్గాల్లో మాత్రం మోదీ హవా కన్నా నితీశ్, లాలూ హవా కొనసాగే అవకాశం ఉంది. పైగా దేశ వ్యాప్తంగా మోదీ ప్రభావం ఉన్న సమయంలో కూడా ఇక్కడ బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కోల్పోయి చతికిలపడింది. ఇప్పటికే ఒక వ్యూహం ప్రకారమే ముస్లిం వ్యతిరేక చర్యలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేస్తోందని దేశ వ్యాప్తంగా నిరసనలు రచ్చకెక్కడం కూడా బీజేపీకి కొంత ప్రతికూలంగా ఉన్న అంశం కావచ్చు.

మరో పక్కన తొలిసారి బరిలోకి దిగిన హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా బీహార్ లో తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టి బీజేపీపై ముస్లింలకు ఉన్న వ్యతిరేకతను తమకు ఓట్లుగా మార్చుకునే దిశగా ముందడుగులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో నిరక్షరాస్యత, పేదరికంతో నిండి ఉండటమే కాకుండా వలసదారులు కూడా ఎక్కువే. సిమాంచల్, కిషన్ గంజ్, పుర్నియా, ఖతిహార్, అరేరియాలో ఎక్కువగా ముస్లింలు ఉండగా, మదిపురా, సహస్రాలో ఎక్కువగా యాదవులు ఉన్నారు. ముస్లింలు, యాదవులు మాత్రమే ఈ నియోజకవర్గాల్లో కీలకపాత్ర పోషిస్తారని ప్రముఖ రాజకీయవేత్త మహేందర్ యాదవ్ కూడా అన్నారు. దీంతో మొత్తం ఏడు జిల్లాల్లో జరగనున్న తుది పోరులో ఓటర్లు ఏ పార్టీల అభ్యర్థికి పట్టం కడతారనేది తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వేచి ఉండాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles