two long-acting injectable drugs indicates it might be possible to keep HIV at bay indefinitely with injections every month | hiv medicines

Two injections every month could control hiv johnson and johnson viiv healthcare

hiv injections, hiv injected drugs, injected drungs every month to control hiv, hiv control drugs, viiv hiv drugs, aids drugs, johnson and johnson, johnson and johnson healthcare, viiv healthcare

Two injections every month could control HIV johnson and johnson viiv healthcare : two long-acting injectable drugs indicates it might be possible to keep HIV at bay indefinitely with injections every month | hiv medicines. Johnson & Johnson and partner ViiV Healthcare, which specializes in HIV drugs, on Tuesday announced results from the first 32 weeks of the planned 96-week study, which combines one drug from each company.

ఇంజెక్షన్ పట్టు.. హెచ్ఐవీకి చెక్ పెట్టు!

Posted: 11/04/2015 11:42 AM IST
Two injections every month could control hiv johnson and johnson viiv healthcare

ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ‘హెచ్ఐవీ’ని నియంత్రించేందుకు చాలాకాలం నుంచి నిరంతర పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. కానీ.. చాలావరకు కంపెనీలు దీనిని నియంత్రించకలిగే మందుల్ని కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ముందుకొచ్చిన రెండు ప్రముఖ కంపెనీలు సంయుక్తంగా కలిసి పరిశోధనలు జరపగా.. ఈ వ్యాధి నియంత్రణ దిశగా అవి కీలక అడుగు వేశాయి. సుదీర్ఘకాలం క్రియాశీలంగా ఉండే రెండు ఇంజెక్ట్‌బుల్ ఔషధాలను నెలకు లేదా రెండు నెలలకోసారి రోగికి ఇస్తే.. హెచ్‌ఐవీకి నిరవధికంగా చెక్ పెట్టవచ్చునని ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైంది. హెచ్ఐవీ నిరోధానికి జాన్సన్ అండ్ జాన్సన్, దాని భాగస్వామ్య సంస్థ వీఐఐవీ కలిసి చేపడుతున్న ప్రాథమిక పరీక్షా ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది.

హెచ్‌ఐవీ వ్యాధి నిరోధక ఔషధాలు అందించడంలో వీఐఐవీ పేరెన్నికగన్న సంస్థ. ఆ వ్యాధికి సంబంధించి ఇప్పటివరకు ఎన్నో ఔషధాలను తీసుకొచ్చిన ఈ సంస్థ.. హెచ్ఐవీని నియంత్రించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీతో కలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు కంపెనీలు చేపడుతున్న మొత్తం 96 వారాల అధ్యయనంలో భాగంగా మొదటి 32 వారాల అధ్యయన ఫలితాలను మంగళవారం ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు చేరో ఔషధంతో హెచ్ఐవీ నిరోధానికి ఈ పరిశోధన నిర్వహిస్తున్నాయి. పరిశోధనలో భాగంగా 309 హెచ్‌ఐవీ మంది రోగులపై పరీక్షలు నిర్వహించారు. వీరు తమ రక్తంలోని హెఐవీ వైరస్‌ను నిరోధించేందుకు రోజువారీ ఔషధ మాత్రలను గతంలో తీసుకునేవారు. వీరికి ప్రయోగదశలో ఉన్న ఇంజెక్షన్లు ఇవ్వగా.. దాదాపు 95 శాతం మంది రక్తంలోని హెచ్‌ఐవీ వైరస్‌ను 32 వారాలపాటు నియంత్రించింది. ఔషధమాత్రలు తీసుకునేవారు 91శాతం మందిలో మాత్రమే హెచ్‌ఐవీ నియంత్రణ సాధ్యపడింది.

కానీ.. ఈ ప్రయోగానికి సంబంధించి కీలకమైన అదనపు పరీక్షలు ఇంకా జరుగాల్సింది. అయితే.. ఈ ఔషధ కలయిక చికిత్సకు ఆమోదం లభిస్తే.. ఎయిడ్స్ వ్యాధి నిరోధంలో గణనీయమైన ముందడుగు పడినట్టే భావిస్తున్నారు. మరోవైపు.. మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకునే రెండు గ్రూపుల రోగులకు చికిత్స కొనసాగిస్తూ.. కాలనుగుణంగా వారి రక్తాన్ని పరీక్షిస్తున్నారు. ఈ అధ్యయన నివేదికలను పరిశీలిస్తే.. రానున్నకాలంలో కొత్త విధానమే ఆచరణసాధ్యంగా కనిపిస్తున్నదని హార్వర్డ్ మెడికల్ స్కూలుకు చెందిన ఎయిడ్స్ చికిత్స నిపుణుడు డాక్టర్ డానియెల్ కురిట్జ్‌కెస్ తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hiv injections  johnson and johnson viiv healthcare  

Other Articles