siricilla rajaiah unable to contest warangal by elections

Siricilla rajaiah requests party leaders to change the candidate

Siricilla Rajaiah, Siricilla Rajaiah family members, Siricilla Rajaiah fire accident, Siricilla Rajaiah unable to contest elections, Siricilla Rajaiah requests party to change his candidature, rajaiah warangal by polls, rajaiah family fire accident, siricilla rajaiah daughter in law fire accident, fire accident, four burnt alive, warangal, Siricilla Rajaiah, Warangal bypolls

AS Siricilla Rajaiah’s family members lost their breath in a fire accident at home today he requests party leaders to change his candidature as he is unable to contest by elections

అభ్యర్థిని మార్చండంటూ అధిష్టానానికి రాజయ్య వినతి

Posted: 11/04/2015 08:47 AM IST
Siricilla rajaiah requests party leaders to change the candidate

తన ఇంట్లో అగ్నిప్రమాద ఘటన సంభవించి నలుగురు కుటుంబసభ్యులు సజీవంగా దహనమైన నేపథ్యంలో తాను వరంగల్ ఉప ఎన్నికల బరిలో నిలబడలేనని వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య  పార్టీ అధిష్టానాన్ని కోరారు. తన ఇంట్లో అలుముకున్న విషాధఛాయలు తనను కుంగదీసాయని, ఈ పరిస్థితులలో తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని, అభ్యర్థిని మార్చాలని రాజయ్య పార్టీ పెద్దలను కోరారు. తనపై నమ్మకంతో టిక్కెట్ ఇచ్చిన పార్టీ అధిష్టానం.. తనను క్షమించండి అంటూ ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరారు.  

రాజయ్య వరంగల్‌ లోకసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజయ్య నిన్న ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇవాళ మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంది.  అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో రాజయ్య తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. రెండు రోజుల క్రితమే ఆయన డమ్మి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాజయ్య వినతి మేరకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా అభ్యర్థిని మార్చే యోచనలో వున్నట్లు సమాచారం. అభ్యర్థి మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు, అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sirisilla rajaiah  fire accident  warangal by polls  congress  

Other Articles