fire accident in sirisilla rajaiah house 4 burnt alive

Siricilla rajaiah s family members died in fire accident

Siricilla Rajaiah, Siricilla Rajaiah family members, rajaiah family fire accident, siricilla rajaiah daughter in law fire accident, fire accident, four burnt alive, warangal, Siricilla Rajaiah, Warangal bypolls

Siricilla Rajaiah’s family members lost their breath in the early morning 3 am in a fire accident at home.

ITEMVIDEOS: రాజయ్య ఇంట్లో విషాదం.. అగ్నిప్రమాదంలో కోడలు సహా నలుగురి మృతి

Posted: 11/04/2015 08:13 AM IST
Siricilla rajaiah s family members died in fire accident

వరంగల్‌ ఉప ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆయన ఇంట్లో సంభవించిన అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవలు అభినవ్, ఆయోన్‌, శ్రీయోన్‌ సజీవ దహనమయ్యారు. ఆయన కుటుంబసభ్యులు నలుగురూ అకస్మాత్తుగా అగ్నికి అహుతి కావడంతో ఆయన నివాసంలో విషాదఛాయలు అలుముకోగా, ఇటు రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది. వీరి మృతి స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. అయితే అటు సారిక బంధువులు మాత్రం ఈ అగ్నిప్రమాద ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో రాజయ్యపై కోడలు సారిక ఫిర్యాదు చేసింది. వీరి మధ్య గత కొంతకాలం కుటుంబ కలహాలు ఉన్నాయి. రాజయ్య కుటుంబంపై కోడలు సారిక 498/A కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో విషాదఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజయ్య ఇంట్లో జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నిజానికి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాతే ఈ సంఘటన జరిగినప్పటికీ, బుధవారం తెల్లవారిన తర్వాత గానీ వెలుగులోకి రాలేదు. మృతి చెందిన నలుగురూ బెడ్ రూమ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. హత్యా? అగ్నిప్రమాదమా? ఏమైనా కుట్ర జరిగిందా..? అనే కోణాల్లో డీఎస్పీ, ఇద్దరు సీఐలు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ లీక్‌ కావడంతో  ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు సందేహిస్తున్నారు. అటు రాజయ్య నివాసం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వరండాలో కుప్పకూలిపోయిన రాజయ్యను ఓదారుస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sirisilla rajaiah  fire accident  four burnt alive  warangal  

Other Articles