Dawood Ibrahims Security Upgraded in Pak

Dawood ibrahims security upgraded in pak

Dawood , Ibrahim, Dawood Ibrahim Evidence, Dawood Ibrahim in Pakistan, Dawood Ibrahim Karachi, Dawood Ibrahim PakistanDawood Aide Arrested, Chhota Rajan Deportation, Chhota Rajan gang, Chhota Rajan Indonesia, Chhota Rajan Safety, chhota rajan bali, New Delhi, India

Security of underworld don and India's most wanted terrorist Dawood Ibrahim has been enhanced in Pakistan after the arrest of his bete noire Chhota Rajan in Indonesia.Special commandos of the Pakistan Army have been deployed at Dawood's residences in Karachi and Islamabad where he has been living for more than two decades after the 1993 serial blasts in Mumbai, sources said quoting intelligence reports.

పాక్ లో దావూద్ కు ఫుల్ సెక్యూరిటీ

Posted: 11/03/2015 11:24 AM IST
Dawood ibrahims security upgraded in pak

ముంబై వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు, ముంబై అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ లో మరింత సెక్యూరిటీ కల్పించింది అక్కడి ప్రభుత్వం. భారతదేశం టాప్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న దావూద్ కు పాక్ ప్రభుత్వం మరింత సెక్యూరిటీ పెంచింది. బాలిలో ఛోటా రాజన్ అరెస్టుతో పాకిస్థాన్ లో దావూద్ కు మరింత సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దావూద్ ఇంటికి ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దావూద్ ను కూడా భారత్ కు రప్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో పాక్ ప్రభుత్వం అలర్ట్ అయింది.

దావూద్ ఇబ్రహీం 1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత దేశం వదిలిపారిపోయాడు. అయితే ముందుగా దుబాయ్ లాంటి దేశంలో ఉన్నాడు అని అందరూ అనుకున్నా కానీ పాకిస్థాన్ లోనే తలదాచుకున్నట్లు భారత ఇంటలిజెన్స్ కనిపెట్టింది. అయితే భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు కు పాకిస్థాన్ ఫుల్ సెక్యురిటీ కల్పిస్తోంది. ముంబై పేలుళ్లలో దాదాపు 257 మంది అమాయకుల చావుకు దావూద్ కారణమయ్యాడు. దాంతో పాటుగా మనీ లాండరింగ్, పలు మర్డర్ కేసుల్లో కూడా దావూద్ నిందితుడిగా ఉన్నాడు. అయితే తాజాగా ఛోటా రాజన్ అరెస్టు తర్వాత దావూద్ మీద కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దావూద్ ను ఖచ్చితంగా భారత్ కు రప్పిస్తామని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చెయ్యడం.. పాకిస్థాన్ లో దావూద్ ఉన్నట్లు భారత్ పక్కా సమాచారంతో పాక్ జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే దావూద్ కు ఐఎస్ఐ భద్రతా బృందం చేత రక్షణ కల్పిస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles