Gang war inside district jail leaves two Dawood associates

Gang war inside district jail leaves two dawood associates

gang War, Dawood, Magagaluru, mangaluru Jail, Chhota Rajan

Two persons including an alleged associate of fugitive Dawood Ibrahim were murdered in jail as a result of a gang war. City Police Chief S Murugan, who visited the jail following the incident, told reporters that members of the two gangs clashed when they were having breakfast. The incident, according to preliminary reports, took place when two gangs clashed with each other when the jail inmates were having breakfast. The clash also left Obleshappa, superintendent of the district jail, and other prison inmates nursing injuries of varying nature. Kamal Pant, ADGP (Prisons) in Delhi for a SIT case is headed for the city in the aftermath of the incident.

దావూద్ అనుచరుల హత్య..!

Posted: 11/03/2015 08:36 AM IST
Gang war inside district jail leaves two dawood associates

దేశంలొ కీలకంగా మారిన ఛోటా రాజన్ అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. దావూద్, ఛోటా రాజన్ గ్రూపుల మధ్య పోరు గురించి అందరికి తెలుసు. అయితే బాలిలో ఛోటా రాజన్ అరెస్టు తర్వాత దావూద్ అనుచరుల హత్య తీవ్ర కలకలాన్ని రేపుతోంది. మంగళూరు నగరంలోని సబ్‌ జైలులో ఇద్దరు ఖైదీలు హత్యకు గురయ్యారు. వారు దావూద్‌ ఇబ్రహీం అనుచరులని సమాచారం. రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇద్దరు మరణించారు. టిఫిన్‌ చేసే సమయంలో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో మాడూరు యూసుఫ్‌, గణేశ్‌శెట్టి అనే ఖైదీలు మరణించారు. యూసుఫ్‌పై ప్రత్యర్థులు దాడి చేస్తుండగా.. గణేశ్‌ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిపైనా ఖైదీలు దాడికి దిగారు. వారిద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే మరణించారు.

బెదిరింపులు, హత్య నేరాల్లో యూసుఫ్‌ నిందితుడు. 2010లో బీజేపీ సభ్యుడు సుఖానందశెట్టి హత్య కేసులోనూ నిందితుడు. ఆకాశభవన్‌ శరణ్‌, డాన్‌ విక్కీశెట్టిలతోనూ సంబంధాలున్నట్లు తెలుస్తోంది. మరో ఖైదీ గణేశ్‌శెట్టికి షార్ప్‌ షూటర్‌ అనే పేరుంది. 1994లో మహీంద్ర ప్రతాప్‌ హత్య కేసుకు సంబంధించి 2010లో అరెస్టు చేశారు. కాగా వీరిరువురి హత్యల వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. జైల్లో ఖైదీల మధ్య ఘర్షణకు కారణం, వారికి ఆయుధాలు ఎలా అందాయన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సంఘటన జరిగిన వెంటనే మంగళూరు పోలీస్‌ కమిషనర్‌ మురుగన్‌ జైలుకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. హత్యకు గురైన ఖైదీల బంధువులు ఆస్పత్రికి వచ్చి రోదించారు. అలాగే గాయపడ్డ పోలీసులు, ఖైదీల బంధువులతో ఆస్పత్రి కిటకిటలాడింది. ముందు జాగ్రత్తగా ఆస్పత్రి పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళూరు నగరవ్యాప్తంగా భద్రతను పెంచారు. ఖైదీల హత్యపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్‌ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gang War  Dawood  Magagaluru  mangaluru Jail  Chhota Rajan  

Other Articles