Ap cabinet meeting decided to june 2 as last date for employees

Ap cabinet meeting decided to june 2 as last date for employees

AP, Chandrababu Naidu, Employees, Hyderabad, AP Employees, June 2, AP Cabinet

AP cm Chandrabbau Naidu and his cabinet decided to employees has to come to ap before June 2. Chandrababu Naidu very angry on employees for not leaving Hyderabad

ఏపి ఉద్యోగులు జూన్ 2లోగా రావాలి

Posted: 11/03/2015 08:17 AM IST
Ap cabinet meeting decided to june 2 as last date for employees

అసలే కొత్త రాష్ట్రం కనీసం రాజధాని కూడా లేకుండా ఏర్పడిన రాష్ట్రం. లోటె బడ్జెట్. ఆదాయ వనరులు మాత్రం కనిపించడం లేదు.. రాజధాని నిర్మాణానికి భారీ ఖర్చు ఉంది.. ఇది ఏపి ప్రభుత్వం ముందున్న కష్టాల లిస్ట్. అయితే ఏపి ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారం సిఎం చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా మారింది. హైదరాబాద్ లో ఉద్యోగులు, ఏపిలో చంద్రబాబు ఉంటే పాలన సజావుగా ఎలా సాగుతుందని బాబు హాట్ హాట్ గా ఉన్నారు. అందుకే జూన్ 2వ తేదీలోగా ఉద్యోగులంతా విజయవాడకు రావాల్సిందేనని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలా వచ్చిన వారి పిల్లలకు స్థానికత వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ భేటీలో ఉద్యోగుల తరలింపు, కాపులను బీసీల్లో చేర్చే అంశం, రాజధాని నిర్మాణానికి సంబంధించిన పలు విషయాలు చర్చకు వచ్చాయి.

ప్రభుత్వ ఉద్యోగులంతా వచ్చే ఏడాది జూన్ రెండు నాటికి విజయవాడకు రావాల్సిందేనని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలా వచ్చిన వారి పిల్లలకు స్థానికత వర్తింపజేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండకూడదని కూడా కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం డిసైడ్ అయింది. ఉద్యోగులకు సంబంధించి మేధా టవర్ లో నాలుగు శాఖలు ఏర్పాటు చేయాలని, రెయిన్ట్రీ పార్కులో గృహ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరులో మున్సిపల్, వ్యవసాయశాఖ కార్యాలయాలు వారంలోగా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ఫ్రభుత్వ ఉద్యోగులకు గతంలో హైదరాబాద్ లో కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు 60 కోట్లు రూపాయలు కేటాయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu Naidu  Employees  Hyderabad  AP Employees  June 2  AP Cabinet  

Other Articles