AP CM Chandrababu naidu warned to employees

Ap cm chandrababu naidu warned to employees

Chandrababu, AP, AP Govt, Revenue, Employees, Chandrababu Naidu warning

AP cm Chandraabu Naidu gave strong warning to revenue employees. He said that if people suffer by employees, he will harrase the employees.

ఉద్యోగులను ఇబ్బంది పెడతానంటున్న చంద్రబాబు

Posted: 11/02/2015 08:15 AM IST
Ap cm chandrababu naidu warned to employees

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయడు మరోసారి ఉద్యోగుల మీద తన మార్క్ చూపించారు. తప్పు చేస్తే ఎవరినినైనా చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు. ప్రజలు ఇబ్బంది పడితే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. భూముల విషయంలో చాలాచోట్ల ఎలాంటి గొడవలు లేకపోయినా రెవెన్యూ వర్గాలు కావాలని లిటిగేషన్లు సృష్టిస్తూ పబ్బం గడుపుకొంటున్నాయి. ఇకపై అలాంటి వారిని ఉపేక్షించేది లేదు. బీ కేర్‌ఫుల్‌... ఫినిష్‌ అయిపోతారంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రెవ్యెన్యూ శాఖలో తీవ్రంగా అవినీతి జరుగుతోందని ఆరోపణ వస్తున్న నపథ్యంలో చంద్రబాబు దీని మీద దృష్టిసారించారు.
 
వందలో 80 మంది బాగానే పని చేస్తున్నారు. మిగిలిన 20 మందిపై దృష్టి పెట్టాం. విభజన తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. ఇకపై ఎవరూ.. ఏ స్థాయిలోనూ అవినీతికి పాల్పడటానికి వీల్లేదని స్పష్టం చంద్రబాబు చేశారు. రెవెన్యూ శాఖ ఒక విచిత్రమైన డిపార్టుమెంట్‌. ఒకప్పుడు కరణాలు, మునసబులు ఉండేవారు. వాళ్లు రాసింది వాళ్లకే అర్థమౌతుంది. జమాబందీ పెట్టి వాళ్లు ఏది చెబితే అదే శాసనం. అందుకే ఎన్‌టీఆర్‌ ఆ వ్యవస్థని రద్దు చేశారు. అయితే ఈ శాఖలో ఇంకా పెత్తనం అలానే ఉంది. ఒక తహసీల్దార్‌కు 67 సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం ఉన్నందున, ఏ చిన్న పని కావాలన్నా వీళ్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. రెవెన్యూకు అన్ని సమస్యల నుంచి స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉంది. నేడు ఒక సెల్‌ఫోన్‌ ద్వారా అన్ని పనులూ అయిపోతున్నాయి. వేలిముద్రలు, కనుబొమ్మలు ఆధారంగా పెన్షన్లు చెల్లిస్తున్నాం. రేషన్‌ పంపిణీలోనూ ఈ వ్యవస్థ వచ్చింది. దీని వలన జవాబుదారీతనాన్ని తీసుకొచ్చాం. టెక్నాలజీలో వచ్చిన మార్పులను రెవెన్యూలో తీసుకొచ్చి పారదర్శకతను తీసుకొస్తాం అని చంద్రబాబు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  AP  AP Govt  Revenue  Employees  Chandrababu Naidu warning  

Other Articles