students jac leaders demanding special status attacked by bjp leaders in vijayavada

Bjp leaders thrashed students jac leaders in vijayawada

bjp leaders thrashed students jac leaders, students jac leaders demanding special status, students jac leaders attacked by bjp leaders, ap special status, bjp leaders, attact, students jac leaders, vijayavada

students jac leaders demanding special status attacked by bjp leaders in vijayavada

బెజవాడలో దౌర్జన్యం.. విద్యార్థులను చితకబాదిన బీజేపి నేతల

Posted: 11/01/2015 10:03 PM IST
Bjp leaders thrashed students jac leaders in vijayawada

బెజవాడలో బీజేపి నేతల దౌర్జన్యం అప్రతిహతంగా కోనసాగింది. విద్యార్థి సంఘం నేతలను బిజేపి నేతలు తరమితరమి కోట్టారు. జుట్టు పట్టుకుని మరీ కోట్టారు. కిందపడిన వారిని కూడా లేపి మరీ కోడుతూ తరిమారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి చూస్తున్నా.. విద్యార్థి సంఘం నేతలపై బిజేపీ నేతల దాడి కోనసాగింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులను విజయవాడ బీజేపీ నాయకులు చితకబాదారు. హోదా ప్రకటన విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలసత్వాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి జేఏసీ నాయకులను పరుగెత్తించిమరీ కొట్టారు. ఆదివారం సాయంత్రం విజయవాడలో ఈ సంఘటన జరిగింది. ప్రత్యేక హోదా అంశం కాలగర్భంలో కలిసిపోయినట్లేనని బీజేపీ అగ్రనాయకులు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరగటం గమనార్హం.

విజయవాడ నగరంలోని బీజేపీ కార్యాలయం ఎదుట.. మోదీ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు విద్యార్థి జేఏసీ నాయకులు ప్రయత్నించారు. బయటికి దూసుకొచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. విద్యార్థుల ప్రయత్నాన్ని భగ్నం చేసి, ఇష్టారీతిగా చావబాదారు. బూతులు తిడుతూ, కాళ్లతో తంతూ ఆ ప్రాంతం నుంచి గెంటేశారు. అయినాసరే, విద్యార్థి నాయకులు మాత్రం ప్రత్యేక హోదా నినాదాలను ఆపలేదు. దీంతో బీజేపీ నాయకులు మరింత రెచ్చిపోయారు. ఒక పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఇంత గలాటా జరుగుతున్నప్పటికీ పోలీసులు మిన్నకుండిపోయారు. చివర్లో రంగప్రవేశం చేసి.. బాధితులైన విద్యార్థి నాయకులను స్టేషన్ కు తరలించారు. దాడికి పాల్పడ్డ నాయకులను ప్రశ్నించే సాహనం చేయలేదు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సైతం బీజేపీ నేతలు తగ్గలేదు. ఈ దాడి ఘటనతో విద్యార్థి లోకం భగ్గుమంది. ప్రత్యేకహోదా  సాధన కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తామని ప్రకటించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap special status  bjp leaders  attact  students jac leaders  vijayavada  

Other Articles