Baby born without a brain

Baby born without a brain

Baby, Brain, baby wothout Brain, Emma, Lanarkshire, Aaron

For any mother, hearing their baby's first word is a momentous occasion. But for Emma Murray, it was a moment she thought would never happen with her youngest child Aaron. When the two-year-old said 'Mummy', Emma, from Lanarkshire, Scotland, said it seemed like a miracle as her son was born with only the tiniest part of a brain.

ఆ పిల్లోడికి మెదడు లేదు.. కానీ

Posted: 10/29/2015 10:45 AM IST
Baby born without a brain

అమ్మా అనే పిలుపు వినడం ఏ మహిళ జీవితంలోనైనా అపురూప మైనదే. ఆ బుడతడు రెండేండ్ల వయసులో 'అమ్మా' అని పిలిచాడు. మెదడు లేకుండా పుట్టిన తన కొడుకు కొన్ని నిమిషాలు కూడా బతుకుతాడో లేదో అనుకుంటే రెండేండ్ల వయసుకు చేరుకున్నాడు. తల్లిని గుర్తుపట్టి 'అమ్మా' అని పిలిచాడు. మరి సంతోషంగా ఉండదా ఎమ్మాకు. స్కాట్‌లాండ్‌లోని లనార్క్‌షాయర్‌లో నివసించే ఎమ్మా 2013 మార్చి నెలలో ఓ రోజు కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లింది. భరించలేని ఆ నొప్పి అపెండిసైటిస్‌ కావచ్చు అనుకుంది ఎమ్మా. పరీక్షించిన వైద్యులు పురిటినొప్పులని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ప్రెగెన్సీ అనే అనుమానమే ఆమెకు రాలేదు. అంతకుముందు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, నెలసరి కూడా ఆగిపోలేదు. దీంతో ఆనందం, ఆశ్చర్యం కలిగాయి ఆమెకు. ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది.

అయితే బాబు మెదడుకు సంబంధించిన హౌలోఫ్రాంజెన్సెఫెలీ జబ్బుతో పుట్టాడు. బాబు మెదడులో చిన్న భాగం మాత్రమే ఉంది. దీంతో బాబు మూడు నిమిషాలు లేదా మూడు గంటలు బతకొచ్చని, ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. బాబు అవయవాలు ఎదగవని, మెదడు అభివృద్ధి చెందదని వివరించారు. బాబుకు ఎరాన్‌ అనే పేరు పెట్టింది తల్లి ఎమ్మా. కంటికి రెప్పలా కాపాడుకుంది. పుట్టుకతోనే వైకల్యం ఉన్న ఎరాన్‌కు ప్రస్తుతం రెండేండ్లు నిండాయి. తల్లిని చూడగానే, 'అమ్మా' అని పదే పదే పిలుస్తున్నాడు. చప్పట్లు కొడుతూ తన హావభావాలను తెలుపుతున్నాడు. ఎమ్మా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 10వేల మంది పిల్లల్లో ఒకరిద్దరికి మాత్రమే ఇలాంటి హౌలోఫ్రాంజెన్సెఫెలీ అనే జబ్బు వస్తుందని, చాలా సందర్భాల్లో గర్భంలోనే శిశువు చనిపోతుందని వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baby wothout Brain  Emma  Lanarkshire  Aaron  

Other Articles