Abu Qasim killed in encounter

Top let commander abu qasim killed in encounter

Kasir Abu Qasim, Lashkar-e-Toiba, Army, Jammu kashmir, Enconter

The operational chief of Lashkar-e-Toiba, Kasir Abu Qasim, was killed in an encounter in South Kashmir on Wednesday. Qasim was killed at Khudpora village after a brief encounter with security forces. An army spokesman said that Qasim was killed at 2 am after the army and police launched operation in the area. ”The operation is still in progress. It is a big success,” he said.

ITEMVIDEOS: లష్కరే తోయిబా ఉగ్రవాది ఖాసిం ఎన్ కౌంటర్

Posted: 10/29/2015 09:38 AM IST
Top let commander abu qasim killed in encounter

లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ ఖాసిమ్ హతమయ్యాడు. ఉద్దంపూర్ దాడికి ఖాసిమ్ ప్రధాన సూత్రధారి. ఖుల్గామ్ జిల్లాలో ఉగ్రవాది ఖాసిమ్ ఎన్‌కౌంటర్ జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది ఖాసిమ్ గత ఆగస్టు 5న ఉద్దంపూర్ బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడికి ప్రణాళిక వేశాడు. ఆ దాడిలో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఇటీవల కశ్మీర్‌లో జరుగుతున్న ప్రధాన దాడుల్లో ఖాసిమ్ పాత్ర ఎక్కువగా ఉంది. 2013లో హైదర్‌పోరా ఆర్మీ కాన్వాయ్‌పై కూడా ఖాసిమ్ దాడి చేశాడు. ఎన్‌కౌంటర్ స్పెష్టలిస్ట్ ఆఫీసర్ అల్తాఫ్ అహ్మాద్‌ను చంపిన కేసులో ఖాసిమ్ ప్రధాన నిందితుడు.

బందీ పురా ఘటన తర్వాత అతడిని పట్టించిన వారికి 20 లక్షల నగదు నజరానా ప్రకటించింది కాశ్మీర్ ప్రభుత్వం. ఎన్ఐఏ చాలా కాలంగా అబూ ఖాసిమ్ ను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా  అది సాధ్యపడలేదు. నిన్న రాత్రి నుండి భద్రతా బలగాలకు, లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మధ్య జరిగిన తీవ్ర ఎన్ కౌంటర్ లో అబూ ఖాసిం  మరణించినట్లు తెలుస్తోంది. అబూ ఖాసింతో పాటు మరి కొందరు మరణించినట్లు సమాచారం. శ్రీనగర్ తో పాటు జమ్ము కాశ్మీర్ లో జరిగిన చాలా దాడుల్లో ఖాసిం హస్తం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kasir Abu Qasim  Lashkar-e-Toiba  Army  Jammu kashmir  Enconter  

Other Articles