A Man cut other mans private part

A man cut other mans private part

Private part, Drunken man, Chevella

A Man cut other mans private part Under the influence of alcohol. Two persons drunk heavy and cut a mans private part in chevella.

మద్యం మత్తులో మర్మాంగం కోసేశారు

Posted: 10/24/2015 12:16 PM IST
A man cut other mans private part

మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు పొలం వద్ద పడుకున్న ఓ వ్యక్తి మర్మాంగాన్ని కత్తితో కోసిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన పంబలి శివరాములు(60) మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే పక్కనే ఉన్న మరో గ్రామమైన రేగడిఘనాపూర్ గ్రామానికి చేందిన జి.కుమార్ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి రాత్రి సమయంలో పొలం వద్ద ఉన్న మేకల మంద వద్ద నిద్రపోతున్న శివరాములు మర్మాంగాన్ని కత్తితో కోశారు. చనిపోయాడనుకొని అక్కడి నుంచి వారు పరారయ్యారు.

శివరాములు బోరున విలపిస్తూ ఇంటికి పరుగెత్తి జరిగిన విషయం కుటుంబసభ్యులకు తెలపడంతో వెంటనే శివరాములును చేవెళ్లలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. బాధితుడి కొడుకు నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు  పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Private part  Drunken man  Chevella  

Other Articles