Shocking! 'Angels' groove to garba inside Ahmedabad hospital ICU, helpless patients look on

Munnabhai style garba in gujarat hospital icu sparks outrage

Garba, Garba Dance, Ahmedabad hospital, Sola Civil Hospital, Navratri, Nitinbhai Patel, Shocking video, Garba inside ICU, Gujarat hospital, ahmedabad hospital, hospital icu,

In a shocking incident, staff members of a civil hospital here were seen on video performing garba inside the ICU ward.

ITEMVIDEOS: అహ్మదాబాద్ అసుపత్రిలో దబ్రా డాన్సులు.. పెల్లుబిక్కిన నిరసనలు

Posted: 10/20/2015 09:38 PM IST
Munnabhai style garba in gujarat hospital icu sparks outrage

ఐసీయూలో వున్నా పేషంట్ బంధువులు ఎవరినైనా.. సుదూర ప్రాంతం నుంచి వచ్చామని అడ్మిట్ అయిన తమ పేషంటును చూసి వెళ్తామని కాళ్లా వేళ్లా పడి ప్రాధేయపడినా సవాలక్ష కారణాలు చెబుతుంటారు ఆసుపత్రి సిబ్బంది. ఐసీయూ అంటే అటలా.. ఇక్కడ చేర్చారంటేనే వాళ్ల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అర్థం. రోగులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిత్యం పర్యవేక్షిస్తుంటాం. అదీకాక ప్రతీవారు బంధువంటూనే లోనికి వెళ్లి పేషంట్ ను చూడటం వల్ల వాళ్లకు వైరస్ కూడా సోకే అవకాశముంటుందని వాదిస్తుంటారాు. కాగా ఒక గంటో, రెండు గంటలో గడిచాక చేతి తడిపితేనే లోనికి పంపిస్తామనే స్టాఫ్ ను, గార్డులను మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం.

ఇంతగా లెక్చర్ ఇచ్చే సిబ్బంది అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో రోగులను గాలికి వదిలేసి నర్సులు, ఇతర సిబ్బంది గార్బా డాన్సులు, స్టెప్పులు వేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తోంది. అహ్మదాబాద్‌లోని సోలా సివిల్ ఆస్పత్రిలో సిబ్బంది పెద్ద సౌండుతో మ్యూజిక్ పెట్టుకుని మరీ డాన్సులు చేశారు. గుజరాత్ వైద్యవిద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నితిన్‌భాయ్ పటేల్ ఆ ఆస్పత్రిలో కొత్త డయాలసిస్ సెంటర్ ప్రారంభించి వెళ్లిన కొద్దిసేపటికే ఇదంతా జరిగింది. దసరా నవరాత్రుల సందర్భంగానే పెద్ద సౌండుతో పాటలు పెట్టుకుని డాన్సులు చేసినట్లు తెలుస్తోంది.

ఐసీయూలో, అది కూడా పేషెంట్లను గాలికి వదిలేసి ఇలా డాన్సులు చేయడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు., అసలు డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా తాము ఎలాంటి గార్బా డాన్సు ముందుగా ప్లాన్ చేయలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ హెచ్‌కే భవ్సర్ తెలిపారు. కొందరు నర్సులు, బోయ్‌లు, పేషెంట్లు కలిసి ఆ కార్యక్రమం అయిపోయాక డాన్సులు చేశారని, తమకు విషయం తెలియగానే దాన్ని ఆపించామని ఆయన చెప్పారు. ఇలా జరిగి ఉండకూడదని, బాధ్యులందరికీ నోటీసులు ఇస్తున్నామని అన్నారు. కాగా, దీనిపై తీవ్రస్థాయిలో నిరసనలు పెల్లుబిక్కుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ahmedabad hospital  hospital icu  garba dance  

Other Articles