Rajamouli and Boyapati disappoints Chandrababu Naidu

Rajamouli and boyapati disappoints chandrababu naidu

Rajamouli, Boyapati, Chandraababu, Amaravati, Chandrababu with Boyapati, S.S.Rajamouli

Telugu star directors Rajamouli and Boyapati sreenu reject the proposal of AP cm Chandrababu naidu. Chandra babu offer AMaravati inauguration managment to the star directors.

చంద్రబాబు ను నిరాశపరిచిన రాజమౌళి, బోయపాటి

Posted: 10/19/2015 01:18 PM IST
Rajamouli and boyapati disappoints chandrababu naidu

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి ఏర్పాట్లను ఎంత గ్రాండ్ గా చేస్తున్నారో కొత్తగా చెప్పక్కర్లేదు. కనీవినీ ఎరుగని రీతిలో.. చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి శంకుస్థాసనకు అంతర్జాతీయ ప్రమాణాలతో శాస్ర్తోత్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గతంలో నిర్వహించిన గోదావరి పుష్కరాల ప్రాభవం గురించి తెలుగు వారు ఎప్పుడూ మాట్లాడుకుంటారు. సినిమాల్లో లాగా అన్నీ హంగులతో అదిరిపోయేలా చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు అమరావతి ఏర్పాట్ల మీద కూడా తెలుగు సినిమా దిగ్గజాలను ఏర్పాట్లను చూడాల్సిందిగా కోరగా దానికి అటు నుండి ఎలాంటి స్పందన రాలేదు. చంద్రబాబు నాయుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళిని, బోయపాటి శ్రీనివాస్ ను సంప్రదించగా వాళ్లు అందుకు ముందుకు రాలేదట. అయితే అందుకు కారణాలు కూడా ఉన్నాయట. మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రపోజల్ ను రాజమౌళి, బోయపాటి ఎందుకు రిజక్ట్ చేశారు..? తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవండి.

చంద్రబాబు ప్రభుత్వం అమరావతి శంకుస్థాపన కార్యక్రమం రోజు ప్రతి ఈవెంట్ రిచ్‌గా ఉండాలన్న ఉద్దేశంతో ఆహారం నుంచి కల్చరల్ ఈవెంట్ వరకు ఎక్కడా రాజీ పడడం లేదు. దేశంలోనే ఆయా రంగాల్లో ప్రసిద్ది చెందిన వారిని రంగంలోకి దింపారు. ఇందులో భాగంగా సభా వేదిక సెట్టింగ్ కూడా అదిరిపోవాలని చంద్రబాబు భావించారు. బాహుబలి రాజమౌళిని మించిన వ్యక్తి ఎవరున్నారన్న ఉద్దేశంతో వెంటనే ఆయనను ప్రభుత్వ వర్గాలు సంప్రదించాయట. అమరావతి వేదిక సెట్టింగ్ వేయాలని కోరారు. అయితే రాజమౌళి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లను సమీక్షించిన బోయపాటి శ్రీనివాస్ ను కూడా సంప్రదించారట. ఆయన కూడా కుదరదు అని అన్నట్లుగా సమాచారం. అందుకు గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన విమర్శల దరిమిలా.. తాను అందుకు సిద్దంగా లేనని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాజమౌళి, బోయపాటి ఇద్దరూ చంద్రబాబు నాయుడు ప్రపోజల్ కు ముందుకు రాకపోవడంతో నిరాశ చెందారని సమాచారం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajamouli  Boyapati  Chandraababu  Amaravati  Chandrababu with Boyapati  S.S.Rajamouli  

Other Articles