Quota stir: Hardik detained ahead of India-SA ODI in Rajkot

Hardik patel detained before rajkot odi

india vs south africa, ind vs sa, india south africa, india south africa 2015, hardik patel, hardik patel news, hardik patel video, hardik patel speech, ind vs sa 2015, cricket news, cricket

Hardik had threatened to protest from inside the cricket stadium along with Patidars to press for their demand of reservation for Patidar community.

ముందస్తుజాగ్రత్తా చర్యగా.. అదుపులోకి హార్థిక్ పటేల్..

Posted: 10/18/2015 05:37 PM IST
Hardik patel detained before rajkot odi

భారత్ - సౌతాఫ్రికా మధ్య ఆదివారం మధ్యాహ్నం జరగున్న మూడో వన్డే మ్యాచ్‌లో తాము నిరసన తెలపడం ఖాయమని పటీదార్ అనామత్ ఆందోళన సమితి (పీఏఏస్) నాయకుడు హార్దిక్ పటేల్ ప్రకటన చేసిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఆయనను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నిరసన వ్యక్తం చేసేందుకు హార్దిక్ పటేల్ తన అనుచరులతో స్టేడియంకు బయల్దేరారు. దీంతో పోలీసులు స్టేడియంకు ఐదు కిలోమీటర్ల దూరంలోనే హార్దిక్‌తో పాటు తన అనుచరవర్గాన్ని అరెస్టు చేశారు.

రాజ్ కోట్ వేదికగా జరుగుతన్న ఈ మ్యాచ్ లో అందోళన ద్వారా తన నిరసన కార్యక్రమాలతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని భావించిన హార్థిక్ పటేల్ వ్యూహాలకు పోలీసులు గండికోట్టారు. ఆయనను ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ హార్దిక్ పటేల్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. స్టేడియం చుట్టుపక్కలా 144 సెక్షన్ విధించారు. 2,500 మంది పోలీసులు, 1000 మంది బౌన్సర్లు భద్రతలో ఉన్నారు. అంతకుముందు హార్దిక్ పటేల్ మాట్లాడుతూ.. తనకు, తన మద్దతుదారులకు టికెట్లు దొరికాయని, ఇక నిరసన తెలపడమే ఆలస్యమని ఆయన పేర్కొన్నారు. తామందరం మ్యాచ్‌కు వస్తున్నామని, అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hardik patel  ind vs sa  Rajkot  Gujarat  Arrest  

Other Articles