De Kock century takes South Africa to 270/7 against India

South africa kept to 270 despite de kock hundred

India v South Africa at Rajkot, South Africa tour of India, India cricket, South Africa cricket, india vs south africa, ind vs sa, india south africa, india south africa 2015, ind vs sa 2015, cricket news, cricket

South African line-up that was set for a score over 300 but India's spinners restricted them to 270 for 7.

టీమిండియాకు 271 పరుగుల విజయలక్ష్యం నిర్ధేశించిన సఫారీలు

Posted: 10/18/2015 05:34 PM IST
South africa kept to 270 despite de kock hundred

టీమిండియాతో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు డీ కాక్, డేవిడ్ మిల్లర్ లు శుభారంభం అందించారు. గత  రెండు వన్డేల్లో విఫలమైన మిల్లర్ (33) ఈమ్యాచ్ లో ఫర్వాలేదనిపించినా, మరో ఓపెనర్ డీ కాక్ సెంచరీతో చెలరేగాడు. డీ కాక్ (103 నాటౌట్; 118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) నమోదు చేసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా 38.5  ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులతో భారీ స్కోరు దిశగా వెళుతున్నట్లు కనిపించింది.
 
కాగా..  చివరి 11.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేసింది.  స్వల పరుగుల వ్యవధిలో డీ కాక్, ఏబీ డివిలియర్స్(4), జేపీ డుమిని(14)లు పెవిలియన్ కు పంపి దక్షిణాఫ్రికాను టీమిండియా కట్టడి చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డు ప్లెసిస్(60; 63 బంతుల్లో 6 ఫోర్లు) , బెహర్దియన్ (33 నాటౌట్) ఆకట్టుకోవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు  వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో మోహిత్ శర్మకు రెండు వికెట్లు లభించగా, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ లకు తలో వికెట్ దక్కింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Ind vs SA  Rajkot  South Africa  cricket  

Other Articles