1000 Hardiks Will Rise': 22-Year-Old Challenges BJP Chief Amit Shah

Hardik dares amit shah kill me and a 1000 hardiks will rise

Hardik dares Amit Shah: Kill me, Hardik Patel, Amit Shah, Patel quota, OBC reservation category, Patidar Anamat Andolan, patel reservations, gujarat

Patel quota agitation leader Hardik Patel asked BJP president Amit Shah not to interfere in the ongoing agitation of the Patel community for its inclusion in the OBC reservation category.

మా ఉద్యమంలో జోక్యం వద్దు.. ధైర్యముంటే కాల్చి చంపండీ..!

Posted: 10/15/2015 08:01 PM IST
Hardik dares amit shah kill me and a 1000 hardiks will rise

గుజరాత్లో పటేళ్లకు ఓబీసీల్లో రిజర్వేషన్ కావాలని తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న యువ ఉద్యమ కెరటం, పటేల్ అనామత్ అందోళన్ అధినేత హార్ధిక్ పటేల్ బీజేపి జాతీయ అద్యక్షుడు అమిత్ షాకు సవాల్ విసిరారు. ధైర్యముంటే తమ బలగాలతో కాల్చి చంపండీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'అమిత్ షా అవసరం అయితే మీ బలగాలతో దాడులు చేయించుకోండి.. చంపించుకోండి.. నేను పోతే నాలాంటివాళ్లు చాలామంది వస్తారు.. నేను బతికున్నంత వరకు పటేళ్లకు ఓబీసీల్లో రిజర్వేషన్ సాధన ఉద్యమం మాత్రం ఆగదు' అని ఆయన తేల్చి చెప్పారు. అమిత్ షా ఏమి కావాలంటే అది చేసుకునే అవకాశం ఆయనకు వుందని అయితే ఆయన దయచేసి తమ ఉద్యమంలో మాత్రం జోక్యం చేసుకోవద్దని కోరారు. పటేళ్ల ఉద్యమం ఆపేయాలని అమిత్ షా చెప్పిన నేపథ్యంలో హార్థిక్ పటేల్ చాలా తీవ్రంగా స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు చెప్పినంత మాత్రాన తాము ఇన్నాళ్లుగా చేపట్టిన ఉద్యమం ఆపేయాలా అని ప్రశ్నించారు. 'పటేళ్లకు రిజర్వేషన్ల సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి దూరంగా ఉండమని తాను అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మీరు కోరినంత మాత్రానా మా ఉద్యమం ఆగదు. తాను బ్రతికున్నంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపబోమని... బలగాలతో మమ్మల్ని అణిచివేయాలని చూస్తే అదీ చేసుకోండి. అవసరం అయితే తనను చంపేసుకోండంటూ వ్యాఖ్యానించారు. నన్ను చంపినంత మాత్రన ఈ ఉద్యమం ఆగదని, తనలాంటి ఎందరో హార్ధిక్ పటేళ్లు పుట్టివస్తారన్నారు. తమ డిమాండ్లు స్వీకరించేందుకు ప్రయత్నించాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని అమిత్ షాను కోరారు.

తామేం హరెన్ పాండ్యా, అమిత్ జెత్వా, సంజయ్ జోషిలం కాదని చెప్పారు. అమిత్ షా ఎలా పనిచేస్తారో తమకు తెలుసని, అందుకే తమకు ధర్నాలు, నిరసనలు, సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడం లేదని అన్నారు. అవసరం అయితే, బలగాల సాయంతో తమ ఉద్యమాన్ని తుదముట్టించేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని, ఈ విషయం ముందే గ్రహించిన తాము ఆయన దయచేసి ఈ ఉద్యమంలో జోక్యం చేసుకోవద్దని అమిత్ షాకు బహిరంగంగా మీడియా ద్వారా సూచిస్తున్నామని హార్థిక్ పటేల్ చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hardik patel  amith shah  patel reservations  gujarat  

Other Articles