All clear to Amaravati Inauguration

All clear to amaravati inauguration

Dasara, Amaravati, Inauguration, Amaravati news, Chandrababu Naidu, Central govt

Central govt gave permission for the Amaravati Inauguration. Ap new capital Amaravati all set for inauguration on Dasara.

అమరావతికి అడ్డు తొలిగింది.. ఇక అంతా మంచే

Posted: 10/14/2015 01:27 PM IST
All clear to amaravati inauguration

ఏపి కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు అడ్డంకులన్నీ దాదాపుగా తొలగిపోయాయి. నిన్నటిదాకా పర్యావరణ శాఖ నుంచి అనుమతి లేకుండానే పనులు ఎలా మొదలుపెడతారని కొంతమంది విమర్శించారు. అంతేకాక గ్రీన్ కారిడార్ కు సంబంధించి ఓ వ్యక్తి ఏకంగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ కూడా వేశారు. దీనిపై స్పందించిన ట్రైబ్యునల్ అమరావతి పరిధిలో భూమి చదును పనులను నిలిపేయాలని నోటీసులు జారీ చేసింది. తాజాగా అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ పచ్చజెండా ఊపింది. అమరావతికి తమ శాఖ నుంచి రావాల్సిన అనుమతుల ప్రక్రియ మొత్తం పూర్తైందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ప్రకటించారు. ప్రధానిని కలిసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గన్నవరం నుంచి ఢిల్లీ బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే జవదేకర్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.  

అలాగే ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లకు కమిటీలు ఖరారయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో పాటు వివిధ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమీక్షలో మంత్రుల పేర్లను కమిటీల్లో చేర్చారు. స్వాగత కమిటీలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్ లు, ఆతిథ్య కమిటీలో మంత్రులు మృణాళిని, పరిటాల సునీత, పీతల సుజాత, రాష్ట్రస్థాయి ఉత్సవాల కమిటీలో మంత్రులు మాణిక్యాలరావు, అయ్యన్నపాత్రుడు సభ్యులుగా ఉంటారు. మీడియా కమిటీలో సభ్యులుగా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రాజధాని వేదిక కమిటీలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ప్రత్తిపాటి పుల్లారావుల పేర్లు చేర్చారు. నిర్వహణ కమిటీ సభ్యులుగా యనమల రామకృష్ణుడు, నారాయణ, ఆహ్వాన కమిటీ సభ్యులుగా అయ్యన్న పాత్రుడు, కామినేనిలను నియమించారు.

 

Read Alsoఓపెనింగ్ అదిరిపోవాలంటున్న చంద్రబాబు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasara  Amaravati  Inauguration  Amaravati news  Chandrababu Naidu  Central govt  

Other Articles