lkg student punished by school employees

Convent school aayas punish lkg student

jwala sri, lkg student, school employees, hope english medium school, buggaiahvaripeta, eluru, west godavari, aayas, jwala sri fallen ill with punishment,

alleging that a lkg school girl passed tiolet in her dress, aayas of convent school punished and made her stand in hot sun

ఎల్ కే జీ విద్యార్థినికి మండుటెండలో శిక్ష.. ఆయాల కర్కశత్వం

Posted: 10/13/2015 10:25 PM IST
Convent school aayas punish lkg student

విద్యార్థినీ విద్యార్థులకు సద్గుణాలను నేర్పించి.. వారిని రేపటి తరం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు..  కేవలం ధనార్జనే లక్ష్యంగా చేసుకుని పాఠశాలలను నడుపుతూ.. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యంతో వ్యవహరిస్తూ..  విద్యార్థులను క్రమశిక్షణ కల్గిన పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని బడాయిలు చెప్పుకుంటారు. విద్యార్థుల తల్లదండ్రలు నుంచి భారెడు ఫీజులను గుంజే పాఠశాలలు.. కనీసం విద్యార్థులకు మూరెడు సేవలను కూడా అందించడంలో విఫలమవుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ పశ్చిమగోదావరి జిల్లాలోని హోప్ ఇంగ్లీషు మీడియం స్కూల్.

జిల్లాలోని ఏలూరు సమీపంలోని వెంకటాపురం పంచాయతీ బగ్గయ్యవారిపేటలోని హోప్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో మూడేళ్ల చిన్నారిపై ఆయాలు కర్కశత్వంగా వ్యవహరించారు. స్కూల్లో యూరిన్ పోసిందని ఆరోపిస్తూ ఎల్కేజీ విద్యార్థి జ్వాలశ్రీని ఆయాలు మండుటెండలో ఆట స్థలంలోని జారుడు బల్లపై కుర్చోబెట్టారు. అయితే ఆయాలు ఇలా తమ కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నా.. ఉపాధ్యాయులు కానీ, పాఠశాల యాజమాన్యం కానీ వారి చర్యలను అడ్డుకున్న దాఖలాలు లేవు. వేల రూపాయలు ఫీజలు తీసుకుని.. వాటి నుంచి జీతబెత్యాలు తీసుకుంటున్నామన్న కనీస ఇంకితజ్ఞానం కూడా లేకుండా ఆయాలు చిన్నారిని ఎండలో నిల్చోబెట్టారు.

తమకు ఉపాధి కల్పించింది విద్యార్థుల బాగోగులు చూసేందుకేనన్న ప్రధమ బాధ్యతను మర్చి.. ఇలా దారుణంగా శిక్షించారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. సాయంత్రం ఇంటికి వెళ్లిన జ్వాలశ్రీని అనారోగ్యం పాలైంది. దీంతో ఏమైందని ప్రశ్నించడంతో జ్వాలశ్రీ స్కూల్లో జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించింది. దీంతో ఆగ్రహించిన వారు... మంగళవారం ఉదయం స్కూల్కు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పాప అస్వస్థతకు, తమకు ఎటువంటి సంబంధం లేదని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహించిన జ్వాలశ్రీ తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jwala sri  lkg student  school employees  hope english medium school  

Other Articles