Erendira Wallenda Performs Nail-Biting Routine While Dangling From Helicopter

Erendira wallenda dazzles with high flying aerial stunt show

Erendira Wallenda high flying aerial stunt show, Erindera Wallenda, wallenda, nik, helicopter, routine, dangling, north, wife, erendira, performs, carolina, daredevil Nik Wallenda, NASCAR race, Charlotte, North Carolina

Erindera Wallenda says hanging upside down 150 feet above the ground is no big deal. The wife of daredevil Nik Wallenda thrilled a crowd of 100,000 at a NASCAR race in Charlotte, North Carolina.

ITEMVIDEOS: ఒళ్లు గిరిగిట్లు గొలిపే సర్కస్ ఫీట్లు.. అమె సాహసానికి జోహార్లు..

Posted: 10/13/2015 10:23 PM IST
Erendira wallenda dazzles with high flying aerial stunt show

ఐదంతస్థుల భవనం పై నుంచి కిందకు చూస్తేనే సాధరణంగా కళ్లు తిరిగి మైకం కమ్ముతుంది. అలాంటిది ఆకాశంలో ఓ రింగుమీద వేలాడుతూ తలకిందులుగా నిలబడడం చాలా పెద్ద సాహసమేకదా... దాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఎరిండెరా వాలెండా. అమెరికాకు చెందిన సాహస విన్యాసాల క్రీడాకారుడు నిక్‌ వాలెండా భార్య ఎరిండెరా... తాను సయితం ఎందులోనూ తక్కువ కాదంటోంది. లీకాఫ్టర్‌ నేలకు 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. దాని నుంచి వేలాడదీసిన తాడుకు కట్టిన రింగు మీద సర్కస్‌ ఫీట్లు చేస్తున్న యువతి ఎరిండెరా వాలెండా. ఆ విన్యాసాలు తనకు గాలిలో బేలడెంట్‌ చేసినట్లు ఉన్నాయంటోంది.

ఉత్తర కరోలినా రాష్ట్రంలోని చార్లెట్‌ నగరంలో నాస్కార్‌ రేస్‌కు ముందు ఆమె ఈ విన్యాసాలు చేసింది. ఎరిండెరా గాలిలో చిన్న తాడు సాయంతో వేలాడుతూ విన్యాసాలు చేస్తుంటే చూస్తున్న లక్ష మంది ప్రేక్షకుల గుండెలు అదురుతూనే ఉన్నాయి. ఎరిండెరా భర్త నిక్‌ వాలెండా కూడా సాహస విన్యాసాలు ప్రదర్శించే వృత్తిలో ఉన్నవాడే. ఆకాశ హార్యాలపైకి ఎగబాకడం, రోప్‌వాక్‌లు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. మూడేళ్ల క్రితం నయాగార వాటర్‌ ఫాల్స్‌కు అడ్డంగా తాడుకట్టి దానిమీద నిక్‌ చేసిన టైట్రోట్‌ వాక్‌ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Erendira Wallenda  high flying  aerial stunt show  North Carolina  

Other Articles