cm kcr declares tax exsumption for rudhrama devi

Rudhrama devi gets tax exsumption

tax exsumption for rudhrama devi, tax exsumption for tollywood movie, tax exsumption for gunashekar rudhrama devi, telangana historical movie rudhrama devi, Kcr declares tax exsumption for rudhrama devi, entertainment tax, rudhramadevi, gunashekar, dilraju, kcr,

cm kcr declares tax exsumption for telangana historical movie rudhrama devi after dil raju and gunashekar welcomes him cm for perview

సినిమాకు ఆహ్వానించి.. తాంబులం అందుకున్న దర్శకుడు..

Posted: 10/08/2015 01:56 PM IST
Rudhrama devi gets tax exsumption

విడుదలకు ముందు అనేక బాలారిష్టాలను ఎదుర్కోని.. చివరకు వాయిదాల పరంపరకు స్వస్తి పలికి.. అక్టోబర్ 9న రిలీజ్కు రెడీ అవుతన్న ప్రతిష్టాత్మక చిత్రం 'రుద్రమదేవి'కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించింది. తెలంగాణ చరిత్ర నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ముఖ్యమంత్రిని అహ్వానించేందుకు వెళ్లిన ఆ దర్శకుడు.. అనూహ్యంగా ప్రభుత్వ తాంబూలం అందుకున్నాడు. ఓరుగల్లు వీరనారి రుద్రమదేవి కథగా తెరకెక్కిన ఈ సినిమాకు వినోద పన్ను నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్ తో పాటు, నిర్మాత దిల్ రాజు గురువారం కేసీఆర్ ను కలిసిన నేపథ్యంలో ఈ మేరకు హామి ఇచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను రుద్రమదేవి సినిమా ప్రీవ్యూ చూడాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు. కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందిస్తూ అందుకు సమ్మతి తెలిపారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. తన సొంత నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : entertainment tax  rudhramadevi  gunashekar  dilraju  kcr  

Other Articles